సరోజినీ నాయుడుని ఆ పేరుతో ఎందుకు పిలుస్తారో తెలుసా?

దివంగత సరోజినీ నాయుడు.ఒక రాజకీయ కార్యకర్త, మహిళా హక్కుల మద్దతుదారు, స్వాతంత్ర్య సమరయోధురాలు.

 Do You Know Why Sarojini Naidu Is Called By That Name Sarojini Naidu, Freedom F-TeluguStop.com

భారత జాతీయ కాంగ్రెస్ మొదటి మహిళా అధ్యక్షురాలు, ఆమె ప్రభావవంతమైన ప్రసంగం, శక్తివంతమైన రచనల కారణంగా ఆమెను “నైటింగేల్ ఆఫ్ ఇండియా” అని పిలుస్తారు.సరోజినీ నాయుడు 1879 ఫిబ్రవరి 13న హైదరాబాద్‌లో జన్మించారు.

ఆమె తండ్రి ఘోరనాథ్ ఛటోపాధ్యాయ హైదరాబాద్ నిజాం కళాశాల ప్రిన్సిపాల్.సరోజిని మద్రాసులోనూ, లండన్‌లోని కింగ్స్ కాలేజీలోనూ చదివారు.

సరోజిని.గోపాలకృష్ణ గోఖలేను తన ‘రాజకీయ తండ్రి’గా భావించారు.

సరోజిని భారత స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు.ఆమె కాంగ్రెస్‌లో చేరి 1925లో భారత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితులయ్యారు.

ఆ తర్వాత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఉత్తరప్రదేశ్‌కు తొలి మహిళా గవర్నర్‌గా నియమితులయ్యారు.సరోజినీ నాయుడుకి చిన్నప్పటి నుంచి కవితలంటే చాలా ఆసక్తి.సరోజినీ నాయుడు తన 12 సంవత్సరాల వయస్సులో తన సాహిత్య జీవితాన్ని ప్రారంభించారు.

మహెర్ మునీర్‘ నాటకం ద్వారా గుర్తింపు పొందారు.సరోజినికి 16 ఏళ్ల వయసులో హైదరాబాద్ నిజాం నుంచి స్కాలర్‌షిప్ వచ్చింది.దీని తర్వాత ఆమె లండన్‌లోని కింగ్స్ కాలేజీలో చదువుకోవడానికి వెళ్లారు.భారతదేశంలో ప్లేగు మహమ్మారి ప్రభలిన సమయంలో ఆమె చేసిన కృషికి బ్రిటిష్ ప్రభుత్వం ఆమెకు ‘కైజర్-ఎ-హింద్‘ పతకాన్ని అందించింది.అయితే జలియన్‌వాలాబాగ్ ఊచకోత ఉదంతం తరువాతా ఆమె అందుకు నిరసనగా ఆమె ‘కైజర్-ఎ-హింద్‘ పతకాన్ని తిరిగి ప్రభుత్వానికి అప్పగించారు.

సరోజినీ నాయుడు 1949 మార్చి 2న స్వాతంత్ర్యం వచ్చిన రెండేళ్ల తర్వాత లక్నోలోని ప్రభుత్వాసుపత్రిలో గుండెపోటుతో మరణించారు.ఆమె తన చివరి రోజుల్లో ఆమె తన కార్యాలయంలో పనిచేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube