క్యూబా దేశం పీతల బెడదలో చిక్కుకుంది.క్యూబాలోని అనేక తీర ప్రాంతాలలో పీతలు లెక్కకు మించి కనిపిస్తున్నాయి.
మనుషులపై పగ తీర్చుకునేందుకు అవి సముద్రం నుంచి బయటకు వచ్చి భూమిపై తిరుగుతున్నాయి.ఎరుపు, నలుపు, పసుపు, నారింజ రంగుల పీతలు రోడ్ల మీద తిరుగుతున్నాయి.
అలాగే అడవులు మొదలుకొని ఇళ్ల గోడల వరకు ప్రతి ప్రాంతాన్ని ఆక్రమించాయి.పీతల వలన ఎక్కువగా ప్రభావితమయిన ప్రాంతం బే ఆఫ్ పిగ్స్.
నిజానికి ఈ పీతలు ప్రతి సంవత్సరం బయటకు వస్తాయి.అయితే ఇక్కడ సమస్య ఏమిటంటే.
ఈసారి అవి ముందుగానే బయటకు వచ్చాయి.దీనిని ఊహించని స్థానిక ప్రభుత్వ అధికారులు, ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.
ఈ పీతలకు కరోనా కాలం ఎంతో కలసివచ్చింది.కరోనా పీరియడ్‌లో లాక్‌డౌన్ కారణంగా మానవ కార్యకలాపాలు దాదాపు రెండేళ్లపాటు నిలిచిపోయాయి.
అడవులు, సముద్ర ప్రాంతాలు, రహదారులు తదితర ప్రాంతాల్లో జన సంచారం లేదు.దీంతో పీతలకు పూర్తి స్వేచ్ఛ దొరికినట్లయ్యింది.బయట తిరుగాడేందుకు సంతానోత్పత్తికి వాటికి అవకాశం దొరికింది.ఫలితంగా ఈ లాటిన్ దేశంలో పీతల జనాభా చాలా వేగంగా పెరిగింది.
వాహనాలు నడిచే రోడ్లు లాక్‌డౌన్ సమయంలో ఖాళీగా మారాయి.పీతలకు ఇది గొప్ప అవకాశంగా మారింది.
రోడ్లు, ఇతర ప్రాంతాలను దాటి, అవి కోరుకున్న ప్రదేశాలకు వెళ్లి మరిన్ని పీతలను ఉత్పత్తి చేశాయి.ప్రస్తుతం బే ఆఫ్ పిగ్స్ ప్రాంతం చుట్టూ కోట్లాది పీతలు తిరుగాడుతున్న పరిస్థితి నెలకొంది.
బే ఆఫ్ పిగ్స్‌కి ఒకవైపు సముద్రం ఉంటుంది.మరోవైపు అటవీ ప్రాంతం ఉంటుంది.
ఈ రెండూ పీతలకు ఎంతో ప్రయోజనాన్ని అందించాయి.ఈ ప్రాంతం క్యూబా యొక్క దక్షిణాది చివరలో ఉంది.
కాగా ఈ పీతలు బయటకు రాగానే వాహనాల చక్రాల కింద పడి చనిపోతున్నాయి.ఇక్కడ అత్యంత దారుణమైన విషయం ఏమిటంటే, చనిపోయిన పీతల నుండి వెలువడే దుర్వాసన అత్యంత ఘోరంగా ఉంటోంది.
ఇది ఈ ప్రాంతాన్నంతటినీ కలుషితం చేసింది.







