తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిత్రం( Chitrem ) అనే సినిమాతో సంచలనాన్ని సృష్టించిన దర్శకుడు తేజ( Teja )… ఈయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం అయితే ఉంటుంది.ఇక అందులో భాగంగానే ఆయన మొదట్లో చేసిన ప్రతి సినిమా యూత్ ను ఎక్కువగా ఆకట్టుకుంటూ మంచి విజయాలను అందుకుంటూ వచ్చాయి.
ఇక ఆ క్రమంలోనే ఆయన చేసిన ప్రతి సినిమా మంచి సక్సెస్ ను సాధించాయి.ఉదయ్ కిరణ్, నితిన్ లాంటి హీరోలకి మంచి విజయాలను అందించాడు.
ఆ సమయం లోనే మహేష్ బాబు తో కూడా ఒక సినిమా చేయమని కృష్ణ తేజ చెప్పాడు.ఇక ఆ ప్రాసెస్ లో తేజ మహేష్ బాబు తో నిజం అనే సినిమా చేశాడు.
అది ఫ్లాప్ అయింది అయినప్పటికీ మహేష్ బాబు కి మాత్రం నటుడుగా మంచి పేరు వచ్చింది అలాగే నంది అవార్డ్ కూడా వచ్చింది.

ఇక అప్పటినుంచి ఇప్పటివరకు తేజకి పెద్దగా సక్సెస్ లు అయితే రావడం లేదు.దాంతో రానా( Rana ) ను హీరోగా పెట్టీ చేసిన ‘నేనే రాజు నేనే మంత్రి ‘ సినిమాతో ఒక మంచి సక్సెస్ ను అందుకున్నాడు.ఇక ఇది ఇలా ఉంటే మళ్ళీ ఇప్పుడు రానా తోనే ‘రాక్షస రాజా’ అనే సినిమా( Rakshasa Raja ) చేస్తున్నాడు.
నిజానికి తేజ ని ఏ హీరో కూడా నమ్మక పోయినప్పటికీ రానా మాత్రం మొదటి నుంచి బాగా నమ్ముతూ వస్తున్నాడు.దానికి కారణం ఏంటి అంటే తేజలో ఉన్న నిజాయితీ ఆయనకు చాలా ఇష్టం అంట.ఏదైనా నిజాయితీగా చెప్పాలని అనుకుంటాడు.

అందువల్లే తేజకి తనకి మంచి ర్యాపో కుదిరిందని అన్నడుకే తేజ ఎప్పుడు డేట్స్ అడిగితే అప్పుడు తను ఇవ్వడానికి రెడీగా ఉన్నానని కూడా రానా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం…ఇక ప్రస్తుతానికి రాక్షస రాజా షూటింగ్ లో బిజీగా ఉన్న తేజ ఈ సినిమా పూర్తయిన తర్వాత కొత్త వాళ్లతో మరో ప్రాజెక్ట్ చేయబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.ఇక ఇది ఇలా ఉంటే తేజ లాంటి స్టార్ డైరెక్టర్ తో సినిమా చేసే అవకాశం రానాకి రావడం రానా అదృష్టం అంటూ మరి కొంతమంది అవాళ్ల అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు…