Mamitha Baiju : ప్రేమలు హీరోయిన్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా.. తెలుగు ప్రేక్షకుల న్యూ క్రష్ అంటూ?

గత శుక్రవారం రోజున గామి, భీమా, ప్రేమలు సినిమాలు విడుదల కాగా ఈ మూడు సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చిందనే సంగతి తెలిసిందే.ప్రేమలు మూవీ డబ్బింగ్ మూవీ కాగా యూత్ ను ఈ సినిమా బాగానే ఆకట్టుకుంది.

 Interesting And Shocking Facts About Mamita Baiju Details Here Goes Viral In So-TeluguStop.com

ప్రేమలు సినిమా( Premalu ) హీరోయిన్ మమితా బైజు పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో మారుమ్రోగుతోంది.రాజమౌళి మెచ్చిన ఈ యంగ్ హీరోయిన్ కు తెలుగులో సైతం ఆఫర్లు వస్తున్నాయని తెలుస్తోంది.

ప్రేమలు సినిమా ఊహించని స్థాయిలో సక్సెస్ కావడానికి మమితా బైజు అందం, నటన ప్రధాన కారణమని చెప్పవచ్చు.సాఫ్ట్ వేర్ ఉద్యోగి రీనూ రోల్ లో నటించిన మమితా బైజు( Mamitha Baiju ) ఆ పాత్రకు ప్రాణం పోశారనే చెప్పాలి.మమితా బైజు క్యూట్ అని కొంతమంది కామెంట్లు చేస్తుండగా న్యూ క్రష్ అంటూ మరి కొందరు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.కోలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికే మమితా బైజు పలు క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటించారు.

జీవీ ప్రకాష్ కుమార్, మమిత బైజు జంటగా నటించిన రెబల్ మూవీ( Rebel ) ఈ నెల 22న రిలీజ్ కానుంది.విష్ణు విశాల్ కు జోడీగా ఈ బ్యూటీ ఒక సినిమాకు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.ప్రేమలు మూవీ మమితాకు 16వ మూవీ కాగా కెరీర్ తొలినాళ్లలో ఆమె ఎక్కువగా సపోర్టింగ్ రోల్స్ లో నటించారు.2017 సంవత్సరంలో నటిగా కెరీర్ ను మొదలుపెట్టిన ఈ బ్యూటీ పలు అవార్డ్ లను సైతం సొంతం చేసుకున్నారు.తెలుగు సినిమాల్లో మగధీర, ఈగ ఇష్టమని చెబుతున్న ఈ బ్యూటీ బన్నీకి జోడీగా నటించే చాన్స్ కోసం ఎదురుచూస్తున్నానని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు.సైకాలజీలో గ్రాడ్యుయేషన్ చేస్తున్న మమితా బైజు తాను సినీ రంగంలోనే రాణిస్తానని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube