Mamitha Baiju : ప్రేమలు హీరోయిన్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా.. తెలుగు ప్రేక్షకుల న్యూ క్రష్ అంటూ?
TeluguStop.com
గత శుక్రవారం రోజున గామి, భీమా, ప్రేమలు సినిమాలు విడుదల కాగా ఈ మూడు సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చిందనే సంగతి తెలిసిందే.
ప్రేమలు మూవీ డబ్బింగ్ మూవీ కాగా యూత్ ను ఈ సినిమా బాగానే ఆకట్టుకుంది.
ప్రేమలు సినిమా( Premalu ) హీరోయిన్ మమితా బైజు పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో మారుమ్రోగుతోంది.
రాజమౌళి మెచ్చిన ఈ యంగ్ హీరోయిన్ కు తెలుగులో సైతం ఆఫర్లు వస్తున్నాయని తెలుస్తోంది.
"""/" /
ప్రేమలు సినిమా ఊహించని స్థాయిలో సక్సెస్ కావడానికి మమితా బైజు అందం, నటన ప్రధాన కారణమని చెప్పవచ్చు.
సాఫ్ట్ వేర్ ఉద్యోగి రీనూ రోల్ లో నటించిన మమితా బైజు( Mamitha Baiju ) ఆ పాత్రకు ప్రాణం పోశారనే చెప్పాలి.
మమితా బైజు క్యూట్ అని కొంతమంది కామెంట్లు చేస్తుండగా న్యూ క్రష్ అంటూ మరి కొందరు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.
కోలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికే మమితా బైజు పలు క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటించారు.
"""/" /
జీవీ ప్రకాష్ కుమార్, మమిత బైజు జంటగా నటించిన రెబల్ మూవీ( Rebel ) ఈ నెల 22న రిలీజ్ కానుంది.
విష్ణు విశాల్ కు జోడీగా ఈ బ్యూటీ ఒక సినిమాకు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.
ప్రేమలు మూవీ మమితాకు 16వ మూవీ కాగా కెరీర్ తొలినాళ్లలో ఆమె ఎక్కువగా సపోర్టింగ్ రోల్స్ లో నటించారు.
2017 సంవత్సరంలో నటిగా కెరీర్ ను మొదలుపెట్టిన ఈ బ్యూటీ పలు అవార్డ్ లను సైతం సొంతం చేసుకున్నారు.
తెలుగు సినిమాల్లో మగధీర, ఈగ ఇష్టమని చెబుతున్న ఈ బ్యూటీ బన్నీకి జోడీగా నటించే చాన్స్ కోసం ఎదురుచూస్తున్నానని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు.
సైకాలజీలో గ్రాడ్యుయేషన్ చేస్తున్న మమితా బైజు తాను సినీ రంగంలోనే రాణిస్తానని వెల్లడించారు.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి26, ఆదివారం 2025