తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్న స్టార్ హీరో పవన్ కళ్యాణ్( Pawan Kalyan )… ఈయన చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికీ యూత్ లో ఆయనకు ఉన్న క్రేజ్ మాత్రం ఎవరికి లేదు అనే చెప్పాలి.అలాగే ప్రస్తుతం ప్రేక్షకులకు ఆయన మీద అభిమానం తార స్థాయిలో ఉందనే చెప్పాలి.
ఇక సినిమాల్లో వచ్చిన క్రేజీని క్యాశ్ చేసుకోవడానికి ఆయన పాలిటిక్స్ లోకి కూడా అడుగు పెట్టాడు.ఇక మరో నెల రోజుల్లో ఏపీ ఎలక్షన్స్ ఉండటం తో పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమా షూటింగ్ లకు బ్రేక్ ఇచ్చి పాలిటిక్స్ క్యాంపైన్ లలో బిజీగా తిరుగుతున్నాడు.
ఇక ఇలాంటి పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ( Trivikram Srinivas )దర్శకత్వం లో వచ్చిన జల్సా సినిమా( Jalsa movie ) మంచి విజయాన్ని అందుకుంది.ఈ సినిమాలో కామెడీ గాని, ఎమోషన్స్ గాని, ఫైట్ సీక్వెన్సెస్ కానీ అన్ని హైలెట్ గా నిలుస్తాయి.ఇక గురూజీ రాసిన డైలాగ్ లు అయితే సినిమా మొత్తానికి హైలెట్ అనే చెప్పాలి.ఇక ఇది ఇలా ఉంటే బ్రహ్మానందంతో పవన్ కళ్యాణ్ కి ఒక పెద్ద కామెడీ సీక్వెన్స్ అయితే ఉంటుందట… కానీ సినిమా మొత్తం అయిపోయిన తర్వాత సినిమాను చూసిన పవన్ కళ్యాణ్ బ్రహ్మానందం ( Brahmanandam )కి తనకి మధ్య ఒక పది నిమిషాలపాటు ఉన్న కామెడీ సీక్వెన్స్ మొత్తాన్ని తీసేయమని చెప్పాడట.
ఎందుకంటే అప్పటికే ఆ సినిమాలో బ్రహ్మానందానికి పవన్ కళ్యాణ్ కి మధ్య బీభత్సమైన కామెడీ జనరేట్ అయింది.
ఇక ఆ పది నిమిషాలు ఎపిసోడ్ కూడా పెట్టడం వల్ల అభిమానులకు బోర్ ఫీల్ రావచ్చు అనే ఉద్దేశ్యం తోనే ఆ సీన్ ని సినిమాలో నుంచి కట్ చేయించి, సినిమాను రిలీజ్ చేయించారట.ఇక పవన్ కళ్యాణ్ అనుకున్నట్టుగానే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ బ్రహ్మానందం మధ్య కామెడీ సీన్స్ కి మంచి పేరు వచ్చింది.ఈ సీక్వెన్స్ కూడా ఉన్నట్టయితే సినిమా మరో రేంజ్ లో ఉండేదని కొంతమంది చెబుతూ ఉంటే, ఇక ఆ సీన్ కూడా ఉంటే సినిమాను చాలా బోర్ గా ఫీల్ అయ్యేవాళ్ళమంటూ ఇంకొందరు చెబుతూ ఉంటారు.
ఇక ఇది ఇలా ఉంటే ఈ సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఒక మంచి సక్సెస్ ని ఇచ్చిన సినిమా అనే చెప్పాలి…
.