వేసవికాలం వచ్చిందంటే నీళ్ల కంటే ఎక్కువగా కూల్ డ్రింక్ తాగేస్తుంటారు.ఇక ఇంట్లో జరిగే ఫంక్షన్ లలో, పెళ్లి వేడుకలలో కచ్చితంగా కూల్ డ్రింక్స్ ఉండాల్సిందే.
అయితే బాటిల్ లో కూల్ డ్రింక్ నిండుగా ఉండకుండా కాస్త ఖాళీగా ఉంటుంది అని అందరికీ తెలిసిందే.కానీ కాస్త ఖాళీగా ఎందుకు ఉందో చాలామందికి తెలియదు.
అసలు దాని గురించి ఎవరు ఆలోచించరు.పెద్దగా పట్టించుకోరు.
ఈ విషయం ఎవరిని అడిగినా సరైన సమాధానం చెప్పలేరు.కానీ బాటిల్లో కూల్ డ్రింక్(Cool drink ) కాస్త ఖాళీగా ఉండడం వెనక పెద్ద రహస్యమే దాగి ఉంది.
అసలు కూల్ డ్రింక్ బాటిల్ కాస్త ఖాళీగా ఎందుకు ఉంటుందో అనే వివరాలు పూర్తిగా తెలుసుకుందాం.

కూల్ డ్రింక్ అంటే ఫ్లేవర్డ్ కార్బోనేటేడ్ వాటర్.ఈ వాటర్ ను బాటిల్లో నింపినప్పుడు బయట కంటే లోపల ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది.ఆ డ్రింక్ ఎప్పుడు బయటికి రావాలా అని సిద్ధంగా ఉంటుంది.
బాటిల్ ను కాస్త షేక్ చేసి ఓపెన్ చేస్తే బయటకు ఎలా వస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అంటే బాటిల్ ఫుల్ గా ఉంటే కార్బన్ డయాక్సైడ్( Carbon dioxide ) ఒత్తిడి బాటిల్ పై పడి, ఉష్ణోగ్రత తీవ్రంగా ఉంటే బాటిల్ పగిలిపోయే అవకాశం ఉంది.
కాబట్టి బాటిల్ కాస్త ఖాళీగా ఉంచి తక్కువ ఉష్ణోగ్రత వద్ద ప్యాకింగ్ చేస్తారు.

ప్యాకింగ్ చేసిన బాటిల్ బయట ఎండలో పెట్టిన, వివిధ రకాల ఉష్ణోగ్రతలలో పెట్టిన కూడా బాటిల్ లోపల ఉండే ఉష్ణోగ్రతలో మార్పు అనేది ఉండదు.కాబట్టి బాటిల్లో కాస్త ఖాళీ లేకపోతే కూల్ డ్రింక్ బయటకు వచ్చేస్తుంది.అదే కాస్త ఖాళీ ఉంటే అందులో ఉండే గాలి ఆ ఒత్తిడిని బాటిల్ పై పడనివ్వదు.
ఇంకా ముఖ్యంగా కాస్త ఖాళీగా ఉండడం వల్ల ఎక్స్పైరీ డేట్ వరకు క్వాలిటీ, టెస్టులో మార్పు అనేది ఉండదు.సాధారణంగా చల్లటి ప్రదేశాలలో బాటిల్ గడ్డ కట్టడం, ఉష్ణోగ్రత పెరిగినప్పుడు డ్రింక్ లా మారడం జరుగుతుంది.
ఇలా డ్రింక్ గా మారినప్పుడు అందులో కాస్త ఖాళీ లేకపోతే గ్యాస్ అనేది బాటిల్ పై ఒత్తిడి పెంచడంతో బాటిల్ పగిలిపోతుంది.