తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్న సందీప్ రెడ్డి వంగ రీసెంట్ గా అనిమల్ సినిమా( Animal )తో పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ సాధించి మరోసారి తన సత్తాను చూపించుకున్నాడు.దాదాపు 800 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమాతో ఇండియాలోనే టాప్ డైరెక్టర్ గా ఎదిగాడు ఇక ఇదిలా ఉంటే అర్జున్ రెడ్డి సినిమా స్టోరీ ని మొదట ఆయన సందీప్ కిషన్ కి చెప్పారట.
అయితే సందీప్ కిషన్( Sundeep Kishan ) ఈ సినిమాను రిజెక్ట్ చేయడంతో విజయ్ దేవరకొండ( Vijay Deverakonda ) ఈ సినిమా చేసి మంచి విజయాన్ని అందుకున్నాడు.ఇక మొత్తానికైతే ఈ సినిమా విషయంలో చాలామంది ఈ సినిమాని రిజెక్ట్ చేయడం అది విజయ్ దేవరకొండ దగ్గరికి రావడం ఆయన ఈ సినిమాతో సక్సెస్ సాధించడం అనేది నిజంగా ఒక రకంగా గ్రేట్ అనే చెప్పాలి.ఇక ఇదిలా ఉంటే సందీప్ రెడ్డి వంగ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాలో ప్రభాస్ ను చాలా డిఫరెంట్ గా ప్రెజెంట్ చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.
మరి ఈ సినిమాతో కూడా ఇంతకుముందు సినిమాల మాదిరిగానే సందీప్ మంచి విజయాన్ని అందుకుంటాడా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది.
ఇక మొత్తానికైతే సందీప్ ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్( Allu Arjun ) తో మరొక ప్రాజెక్ట్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఈ సినిమాకు పూర్తి వివరాలను కూడా తొందర్లోనే రాబోతుంది.ఇక ప్రస్తుతం పాన్ ఇండియా సబ్జెక్ట్ లను ఎంచుకొని సూపర్ సక్సెస్ అందుకోవడమే ధ్యేయంగా పెట్టుకున్న సందీప్ తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను అయితే ఏర్పాటు చేసుకున్నాడు.
చూడాలి మరి ఫ్యూచర్ లో ఈయన ఎలాంటి ప్రభంజనాలను సృష్టించబోతున్నాడు అనేది…
.