350 మంది జ‌ర్మ‌న్ సైనికులను పట్టుకున్న గబ్బర్ సింగ్ ఎవరో తెలుసా?

ఉత్తరాఖండ్ అనేక విశేషాలను కలిగి ఉన్నప్పటికీ, గబ్బర్ సింగ్ భూమిగానూ ప్రసిద్ధి చెందింది.ఇక్క‌డి గర్వాల్ ప్రాంతాన్ని గబ్బర్ సింగ్ ల్యాండ్ అని ఎందుకు అంటారో ఇప్పుడు తెలుసుకుందాం.

గబ్బర్ సింగ్ నేగి 1895 ఏప్రిల్ 21న గర్వాల్‌లోని మంజుద్ గ్రామంలో జన్మించాడు.6 అక్టోబర్ 1913లో గర్వాల్ రైఫిల్స్ విభాగంలో చేరాడు.1914 లో అతను మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో ఫ్రాన్స్‌కు వెళ్లాడు.అక్క‌డ జర్మన్ సైన్యానికి వ్యతిరేకంగా యుద్ధం చేయవలసి వ‌చ్చింది.

గబ్బర్ సింగ్ ధైర్యసాహసాలు ప్రదర్శించి 350 మంది సైనికులు మరియు జర్మన్ సైన్యాధికారులను బందీలుగా చేసుకున్నాడు.ఈ యుద్ధంలో ధైర్యంగా పోరాడి 1915 మార్చి 10న వీర మ‌ర‌ణాన్ని పొందాడు.గబ్బర్ సింగ్ నేగీ అమరవీరుడు అయినప్పుడు అతని వయస్సు కేవలం 20 సంవత్సరాలు.1925లో, చంబాలో గర్వాల్ రైఫిల్స్ అతని జ్ఞాపకార్థం ఒక స్మారక చిహ్నాన్ని నిర్మించాయి.అప్పటి నుండి, ప్రతి సంవత్సరం అతని బలిదానం రోజున, సైన్యం అతనికి నివాళులర్పిస్తుంది.

గబ్బర్ సింగ్ పరాక్రమాన్ని చూసి బ్రిటిష్ సైనికులు కూడా చలించి పోయారు.లండన్‌లో అతని పేరు మీద ఒక స్మారక చిహ్నం కూడా ఉంది.

గబ్బర్ సింగ్ జ్ఞాపకార్థం, అతని పుట్టినరోజున ప్రతి సంవత్సరం కూడా ఒక ఫెయిర్ నిర్వహిస్తారు.ఈ సంప్రదాయం 1925 నుండి కొనసాగుతోంది.

Advertisement
వైరల్ వీడియో : క్యాబ్ డ్రైవర్ తో హీరో గొడవ..

తాజా వార్తలు