తెలుగు సినిమా ఇండస్ట్రీలో మకుటం లేని మహారాజుగా దాదాపు 40 సంవత్సరాల పాటు మెగాస్టార్ గా కొనసాగుతున్న ఒకే ఒక్కడు చిరంజీవి( Chiranjeevi ) ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీ లో సూపర్ హిట్ లను అందుకోవడమే కాకుండా ప్రతి ప్రేక్షకుడిని మెప్పించేలా సినిమాలు చేయడం ఆయన నైజం.అందుకే ఇప్పటికి కూడా ఆయన ఏమాత్రం తగ్గకుండా ప్రతి ప్రేక్షకుడు తన సినిమా చూసి విజిల్ వేసేలా అన్ని ఎమోషన్స్ పరిపూర్ణంగా ఉండేలా చూసుకుంటూ మంచి సినిమాలు ప్రేక్షకుడికి అందించడమే లక్ష్యంగా ముందుకు దూసుకెళుతున్నాడు.
ఇక ఇలాంటి క్రమంలో ఆయన చేసిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతూ వస్తున్నాయి.

అయితే అప్పట్లో చిరంజీవి అంటే డాన్స్ కి చాలా ఫేమస్ ఆయన చేసినట్టుగా డాన్స్ లు మరే హీరో చేయలేకపోయేవాడు.ఇలాంటి చిరంజీవి పక్కన హీరోయిన్లు డాన్స్ చేయాలంటే చాలా ఇబ్బంది పడిపోయేవారు కానీ కొంతమంది హీరోయిన్లు మాత్రం చిరంజీవి పక్కన చాలా ఈజీగా స్టెప్పులు వేస్తూ ఉండేవారు.కొన్ని సందర్భాల్లో చిరంజీవినే వాళ్ళని చూసి భయపడుతూ ఉండేవాడట, అలాంటి వాళ్ళు ఎవరు అంటే ఒకప్పుడు హీరోయిన్ రాధ( Radha ), చిరంజీవి కాంబినేషన్ కి వచ్చిన చాలా సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ లను సాధించాయి.
ఇక వీళ్ళ కాంబినేషన్ లో డ్యాన్సులు అయితే అద్భుతంగా ఉండేవి.

కొన్ని సందర్భాల్లో చిరంజీవి సైతం వీళ్లతో డాన్స్ చేయడం చాలా కష్టం అంటూ చెప్పడం విశేషం.అలాగే తనతో పాటు చాలా ఈజీగా స్టెప్పులు వేసే కో ఆర్టిస్ట్ కూడా తనే కావడం విశేషం.ఇక ఈమెతో పాటుగా సమీరా రెడ్డి( Sameera Reddy ) కూడా చిరంజీవితో చాలా ఈజీగా స్టెప్ లు వేస్తుందని చిరంజీవి ఆమె గురించి కూడా చాలా గొప్పగా చెప్పాడు.
ఇక వీళ్ళ కాంబినేషన్ లో జై చిరంజీవ( Jai Chiranjeeva ) అనే సినిమా వచ్చింది.అయితే ఈ సినిమాలో డాన్స్ కు ప్రాధాన్యం ఉన్న సాంగ్స్ చాలా ఉండడంతో చిరంజీవి ఆ స్టెప్ లు వేసేటప్పుడు కొంతవరకు ఇబ్బంది పడ్డాడు.
కానీ సమీరారెడ్డి మాత్రమే చాలా ఈజీగా చిరంజీవి పక్కన స్టెప్ లు వేసిందంటు చిరంజీవి ఆమె గురించి కూడా చాలా గొప్పగా చెప్పాడు…