2022 నాటికి ప్రపంచంలో 800 కోట్ల మంది జనాభా ఉండగా.వీరిలో యువకులు ఎక్కువమంది ఉంటారు.
అయితే కొన్ని దేశాల్లో వృద్ధ జనాభా ఎక్కువగా ఉన్నారు.వృద్ధ జనాభా రోజురోజుకు కొన్ని దేశాల్లో పెరుగుతున్నారు.ప్రస్తుతం ప్రపంచ జనాభాలో వృద్ధుల జనాభా( Elderly population ) 10 శాతం మంది ఉన్నారు.65 ఏళ్లు పైబడినవారు 771 మిలియన్ల మంది ప్రపంచ జనాభాలో ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.ఈ లెక్కన చూసుకుంటే 2050 నాటికి వృద్ధుల జనాభా 16 శాతంకు చేరుకునే అవకాశముందని అంచనా వేస్తున్నారు.

కొన్ని దేశాల్లో సీనియర్ సిటిజన్ల సంఖ్య బాగా పెరుగుతోంది.ఆఫ్రికా, దక్షిణాసియా, ఇటలీ, ఫిన్లాండ్, జపాన్, ఖతర్, ఊగాండా, ఆప్ఘనిస్తాన్, ఉత్తర అమెరికా, ఐరోపా, దక్షిణ కొరియా, జమైకా, అల్బేనియా దేశాల్లో సీనియర్ సిటిజన్లు ఎక్కువమంది ఉండగా.రానున్న కాలంలో మరింతగా పెరుగుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి.
ఆదాయం ఎక్కువగా ఉన్న దేశాల్లో వృద్ధుల జనాభా పెరుగుతున్నట్లు చెబుతున్నారు.జపాన్‌లో( Japan ) 30 శాతం మంది సీనియర్ సిటిజన్లు ఉండగా.
ఫిన్లాండ్‌లో 23 శాతం మంది, ఇటలీలో 247 శాతం మంది వృద్ధులు ఉన్నారు.అయితే భవిష్యత్తులో ఈ దేశాల్లోనే కాకుండా అన్ని దేశాల్లో సీనియర్ సిటిజన్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

వచ్చే 30 సంవత్సరాల్లో ఆసియా దేశాలతో( Asian countries ) పాటు ఐరోపా, ఉత్తర అమెరికా దేశాల్లో ప్రతి నలుగురికి ఒకరు 65 ఏళ్లుపైబడిన సీనియర్ సిటిజన్లు ఉంటారని అంచనాలు వెలువడుతున్నాయి.ఇక రానున్న కాలంలో దక్షిణ కొరియా, జమైకాలో వృద్ధుల జనాభా 44 శాతంకు చేరుకోవచ్చని, 2100 నాటికి అల్బేనియా దేశంలో వృద్ధుల జనాభా 49 శాతానికి పెరిగి ప్రపచంలోనే సీనియర్ సిటిజన్ల జనాభాలో తొలి స్థానానికి చేరుకోనుందని పలు పరిశోధనలు చెబుతున్నాయి.
