ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పాన్ ఇండియా రేంజ్ లో వినిపిస్తున్న సినిమా సలార్( Salaar ).ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.
భారీ అంతనాల నడుమ పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన ఈ సినిమా విడుదల సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది.దీంతో ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు.
ఈ మూవీ ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.తాజాగా డిసెంబర్ 22న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.
సలార్ సినిమా కథ అంతా ఖన్సార్ అనే నగరం చుట్టూ తిరుగుతుంది.
అయితే సినిమాలో చూపించిన ఈ నగరం నిజంగానే భారతదేశంలో ఉందా ? లేక సినిమా కోసం క్రియేట్ చేశారా ? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు అడియన్స్.అయితే సినిమాలో మాత్రం ఈ నగరం పాకిస్తాన్, గుజరాత్ మధ్య ఉందని చూపించారు.దీంతో నిజంగానే అక్కడ ఈ నగరం ఉందా ? అనే అనుమానాలు వచ్చాయి.నిజానికి ఖన్సార్ అనే నగరం ఉంది.కానీ సినిమాలో చూపించినట్లుగా పాకిస్తాన్, గుజరాజ్ మధ్య కాదు.ఇరాన్( Iran ) లో ఉంది ఈ ఖాన్సార్ కౌంటీ అనే నగరం.ఇరాన్ లోని ఇస్ఫహాన్ ప్రావిన్స్ లో ఉంది.
ఇక్కడ 22 వేలకు పైనే పర్షియన్స్ నివాసం ఉంటున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ సినిమాలో చూపించిన ఖాన్సార్ నగరానికి( khansar ).ఇరాన్ లో ఉన్న ఖాన్సార్ కౌంటీకి అసలు పోలికే ఉండదు.ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా దూసుకుపోతుండడంతో ఖాన్సార్ సిటీ గురించి తెరకైకి వచ్చింది.
ప్రస్తుతం సలార్ ఫస్ట్ ఫార్ట్ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుండడంతో ఇప్పుడు సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.కాగా ఈ చిత్రాన్ని దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్ తో హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన విషయం తెలిసిందే.