తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.శృతి హాసన్ ( Shruti haasan )ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
ఆ సినిమాలు కూడా వరుసగా సూపర్ హిట్ గా నిలుస్తున్నాయి.కాగా 2023 హీరోయిన్స్ లో ఎవరికి బాగా కలిసి వచ్చింది అంటే ముందుగా వినిపించే పేరు శృతిహాసన్.
ఈ యేడు ప్రారంభమే బాలకృష్ఱ, చిరంజీవి సినిమాలతో పలకరించిన ఈ అమ్మడు మళ్లీ నాని హీరోగా వచ్చిన హయ్ నాన్న, ( Hi Nanna )ప్రభాస్ సలార్ సినిమాలలోనూ నటించి ఈ ఏడాదికి గ్రాండ్ గా ముగింపు పలికింది.ఈ సంవత్సరం వచ్చిన సినిమాలన్నీ ఒకదాన్ని మించి మరోటి బ్లాక్‌బస్టర్ హిట్స్‌గా నిలిచి శృతి కేరీర్‌లోనే హ్యాట్రిక్ విజయాలు సాధించి బెస్ట్ ఇయర్‌గా రికార్డులకెక్కింది.

అయితే ఈమె సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి దాదాపు 12 ఏళ్లు అవుతోంది.మధ్యలో దాదాపు మూడు నాలుగు ఏళ్ళ పాటు సినిమాలకు కాస్త దూరం అయింది.మళ్లీ రవితేజ హీరోగా నటించిన క్రాక్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది.క్రాక్ బ్లాక్‌బస్టర్ హిట్ అవ్వడంతో మరోసారి శృతి కెరీర్ గాడిలో పడింది.ఈ క్రమంలోనే సినిమాలపై దృష్టి పెట్టిన అమ్మడు సైలెంట్‌గా వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఈ క్రమంలో మొదట సలార్‌కు( Salaar ) ఆ తర్వాత బాలకృష్ణతో వీర సింహారెడ్డి,( Veera Simha Reddy ) చిరంజీవితో వాల్తేరు వీరయ్య చిత్రాలకు సైన్ చేయడంతో పాటు నాని హీరోగా వచ్చిన హయ్ నాన్న చిత్రంలో ఒక గెస్ట్ రోల్ కూడా చేసింది.

ఈ సినిమాలన్నీ ఈ యేడాదే విడుదలై శృతిహసన్ కు చిరస్మరణీయ భారీ విజయాలను అందించి టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా నెంబర్‌వన్ ప్లేస్‌ను సుస్థిరం చేసి పెట్టాయి.దీంతో అందరూ శృతిహాసన్ ని గోల్డెన్ లెగ్ అని పిలుస్తున్నారు.శృతిహాసన్ చేతిలో ప్రస్తుతం మరిన్ని ప్రాజెక్టులు ఉన్నాయి.ఇప్పుడు శృతిహాసన్ మరొకసారి ఫామ్ లోకి రావడంతో దర్శక నిర్మాతలు ఎక్కువగా శృతిహాసన్ వైపే మొగ్గు చూపుతున్నారు.మరి శృతి హసన్ ఇంకా ముందు ముందు ఎలాంటి సినిమాలలో నటిస్తుందో చూడాలి మరి.







