ఉగాది పండుగ రోజు ఏ సమయంలో పూజ చేయాలో తెలుసా..?

ముఖ్యంగా చెప్పాలంటే ఏప్రిల్ 9వ తేదీన ఉగాది పండుగ( Ugadi festival )ను ప్రజలు ఎంతో వైభవంగా జరుపుకోనున్నారు.

తెలుగు క్యాలెండర్ ప్రకారం క్రోధి నామ సంవత్సరం ఏప్రిల్ 9వ తేదీన మొదలవుతుంది.

తెలుగు సంవత్సరం ప్రారంభం రోజున తెలుగు రాష్ట్రాలలో ఉగాది పండుగను జరుపుకుంటారు.అలాగే ఈ రోజు పంచాంగ శ్రవణం జ్యోతిష్య పండితులు చెబుతారు.

పూజ ఏ సమయంలో చేయాలి.అసలు ఈ రోజున ఏ ఏ కార్యక్రమాలు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా చెప్పాలంటే ఉగాది రోజున ప్రతి ఒక్కరూ తమ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి.

Do You Know What Time To Perform Puja On The Day Of Ugadi Festival , Pooja Room,
Advertisement
Do You Know What Time To Perform Puja On The Day Of Ugadi Festival , Pooja Room,

తెల్లవారుజామునే కుటుంబ సభ్యులంతా స్నానాలు చేసుకొని శుభ్రమైన దుస్తులను ధరించాలి.అలాగే ఇంటి ద్వారానికి మామిడి ఆకుల తోరణాన్ని కట్టాలి.ఇంకా చెప్పాలంటే పూలతో పూజగది( Pooja room )ని అలంకరించుకోవాలి.

కొత్త దుస్తులు వేసుకొని పూజా కార్యక్రమం మొదలుపెట్టాలి.మరో వైపు ఉగాది రోజున భక్షాలు తయారు చేసి భగవంతుడికి నైవేద్యంగా సమర్పించాలి.

అయితే ఉగాది రోజున మూడు నుంచి ఐదు గంటల మధ్య తైలా అభ్యంగన స్నానం చేయాలని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

Do You Know What Time To Perform Puja On The Day Of Ugadi Festival , Pooja Room,

అలాగే మంగళవారం ఉదయం ఐదు గంటల నుంచి ఏడు గంటల 40 నిమిషాల లోగా షడ్రుచులు మిళితమైన ఉగాది పచ్చడి( Ugadi Pachadi ) సేవించాలి.అలాగే ఉదయం 7:15 నిమిషములకు రేవతి నక్షత్ర మేఘ లగ్నమున, ఉదయం 11:34 నిమిషాలకు అశ్వని నక్షత్ర మిథున లగ్నమున చిట్ట,ఆవర్జాలకు, కొత్త పుస్తకాలు, బెల్లం, పంచదార, పసుపు, బంగారం, వెండి రత్నములు క్రయవిక్రయాలు వ్యాపారం చేయవచ్చు.ఎవరెవరు ఏ వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారానికి సంబంధించిన వస్తు సామాగ్రి సరుకులు బోనీ వేయుటకు క్రయవిక్రయాలు చేయవచ్చని నీపుణులు చెబుతున్నారు.

స‌న్ ట్యాన్‌కు చెక్ పెట్టే అవిసె గింజ‌లు..ఎలా వాడాలంటే?
Advertisement

తాజా వార్తలు