బిగ్ బాస్ తెలుగులో ప్రస్తుతం ఏడవ సీజన్ ప్రసారమవుతున్న సంగతి మనకు తెలిసిందే.ఈ సీజన్ లో భాగంగా 14 మంది కంటెస్టెంట్ లో హౌస్ లోకి ఎంటర్ ఇచ్చారు అయితే ఇప్పటికే నాలుగు వారాలను పూర్తి చేసుకున్నటువంటి ఈ కార్యక్రమం హౌస్ నుంచి నలుగురు కంటెస్టెంట్లను ఎలిమినేట్ చేశారు.
ఈ విధంగా బిగ్ బాస్ హౌస్ నుంచి మొదటివారం కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ కాక రెండవ వారం నటి షకీలా ఎలిమినేట్ అయ్యారు.ఇక మూడవ వారం సింగర్ దామిని ఎలిమినేట్ కాక నాలుగవ వారం హౌస్ లో గ్లామర్ డాల్ అనే పేరు తెచ్చుకున్నటువంటి రతిక (Rathika) ఎలిమినేట్ అయ్యారు.
ఈమె టాప్ ఫైవ్ వరకు కొనసాగుతుందని మొదట్లో అందరూ భావించారు.కానీ హౌస్ లో ఈమె వ్యవహార శైలి ఏమాత్రం నచ్చకపోవడంతో ప్రేక్షకులు ఓట్ల రూపంలో ఆమెకి బుద్ధి చెప్పి హౌస్ నుంచి బయటకు పంపించారు.
ఇలా నాలుగవ వారంలో భాగంగా ఈమె ఎలిమినేట్ అయ్యారు.అయితే ఈమె ఎలిమినేట్ అవుతానని అసలు ఊహించుకోలేదు అలాంటిదే తన పేరుని నాగార్జున (Nagarjuna) అనౌన్స్ చేయడంతో ఒక్కసారిగా ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
హౌస్ లో ఉన్నన్ని రోజులు ఈమె అందరిపై రెచ్చిపోతూ మాట్లాడటం తనకిష్టం వచ్చిన విధంగానే నడుచుకోవడం తన స్వార్థం కోసం అందరిని ఉపయోగించుకోవడం చేసింది.

ఇలా హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎమోషనల్ అవ్వడంతో అందరూ కూడా ఈమెపై కామెంట్ చేయడం మొదలుపెట్టారు.ఏది ఏమైనా రతిక ఇలా ఎలిమినేట్ కావడాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు.ఇక హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈమె మొదటిసారి ఇంస్టాగ్రామ్ లో( Instagram ) స్పందిస్తూ పైన ఉన్న పేపర్ చూసి బుక్కు ఎలాంటిదో గెస్ చేయకూడదు అలాగే నా విషయంలో కూడా నేను హౌస్ లో ఉన్న విధానాన్ని బట్టి నన్ను జడ్జ్ చేయకండి అంటూ కామెంట్స్ చేశారు.

హౌస్ నుంచి ఈమె బయటకు రావడంతో తన ఎలిమినేషన్ విషయంలో బిగ్ బాస్( Bigg Boss ) తనకు అన్యాయం చేశారు అన్న ఉద్దేశంతోనే ఈమె మాట్లాడారు.అయితే ఈమె బిగ్ బాస్ హౌస్ లో ఉన్నది కేవలం నాలుగు వారాలు అయినప్పటికీ భారీ స్థాయిలోనే రెమ్యూనరేషన్ (Remuneration) తీసుకున్నారని తెలుస్తుంది.వారానికి రెండు లక్షల రూపాయలు చొప్పున రతిక నాలుగు వారాలకు గాను ఎనిమిది లక్షల రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్నారని తెలుస్తుంది.అయితే తాజాగా ఈమె రెమ్యూనరేషన్ గురించి మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

బిగ్ బాస్ తనని అన్యాయంగా ఎలిమినేషన్ చేశారు అన్న కారణంతో బిగ్ బాస్ నిర్వాహకులపై ఎంతో కోపంతో ఉన్నటువంటి ఈమె వారు ఇచ్చినటువంటి రెమ్యూనరేషన్ విషయంలో కూడా ఏమాత్రం ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది.ఇలా ఎన్నో కలలుకని ఎన్నో టార్గెట్స్ పెట్టుకొని బిగ్ బాస్ లోకి వెళ్లినటువంటి ఈమె నాలుగవ వారంలోని హౌస్ నుంచి బయటకు రావడంతో బిగ్ బాస్ నుంచి ఆమె సంపాదించిన ఈ రెమ్యూనరేషన్ తన స్వలాభం కోసం ఉపయోగించడం లేదట.బిగ్ బాస్ పై ఉన్నటువంటి కోపంతో ఈమె ఎనిమిది లక్షల రూపాయల రెమ్యూనరేషన్ మొత్తం చారిటీకి రాసి ఇచ్చారని తెలుస్తోంది.ఇలా ఈమె డబ్బు మొత్తం చారిటీకి డొనేట్ చేశారు అనే విషయం తెలియడంతో రతిక కూడా పౌరుషం గల రైతుబిడ్డ అంటూ కొందరు కామెంట్స్ చేయగా మరికొందరు ఇంత టెంపర్ అయితే ఎలా అనవసరంగా కష్టపడిన డబ్బుని ఇలా పోగొట్టుకుంటారా అంటూ కూడా కామెంట్ చేస్తున్నారు.