`విట‌మిన్ డి` ఎక్కువైతే ఎలాంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా?

ఆరోగ్యంగా ఉండాలంటే.శ‌రీరానికి అన్ని ప్రోటీన్లు, విట‌మిన్లు, మిన‌ర‌ళ్లు అందాలి.

అలా అందాలి అంటే ప్ర‌తి రోజు ఖ‌చ్చితంగా పోష‌కాహారం తీసుకోవాలి.

ఇదిలా ఉంటే.

నేటి కాలంలో కోట్ల మంది ఫేస్ చేస్తున్న స‌మ‌స్య `విట‌మిన్ డి` లోపం.ముఖ్యంగా చిన్న పిల్ల‌లు, ఆడ‌వారిలో ఈ స‌మ‌స్య ఎక్కువ‌గా ఉంటుంది.

అయితే వాస్త‌వానికి ఎముకలు, కండరాలు, దంతాలు బ‌లంగా ఉండాల‌న్నా.క్యాన్సర్‌, గుండె జ‌బ్బులు, మధుమేహం వంటి స‌మ‌స్య‌లు రాకుండా ఉండాల‌న్నా.

Advertisement

శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెర‌గాల‌న్నా.విట‌మిన్ డి ఖ‌చ్చితంగా తీసుకోవాల్సిందే.

,/br>అందుకే నిపుణులు కూడా ఎప్ప‌టిక‌ప్పుడు విట‌మిన్ డి శ‌రీరానికి అందేలా చూసుకోవాల‌ని చెబుతుంటారు.అయితే శ‌రీరానికి విట‌మిన్ డి అవ‌స‌రం క‌దా అని.ఓవ‌ర్‌గా మాత్రం తీసుకోరాదు.ఎందుకంటే, ఆరోగ్యానికి ఎంత మేలు చేసిన‌ప్ప‌టికీ.

విట‌మిన్ డి శ‌రీరంలో ఎక్కువైతే మాత్రం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.మ‌రి ఇంత‌కీ విట‌మిన్ డి ఎక్కువైతే కలిగే దుష్ప్రభావాలు ఏంటీ అన్న‌ది లేట్ చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.

ఎముక‌ల‌ను బ‌లంగా మార్చ‌డంలో విట‌మిన్ డి కీల‌క పాత్ర పోషిస్తుంద‌న్న సంగ‌తి తెలిసిందే.అయితే ఇక్క‌డ మీకు తెలియ‌ని విష‌యం ఏంటంటే.శ‌రీరంలో విట‌మిన్ డి ఎక్కువైనా.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

ఎముక‌ల‌ను ప్ర‌భావితం చేస్తుంది.ఎముకల క్షీణతకు గుర‌వుతాయి.

Advertisement

అలాగే శ‌రీరంలో విట‌మిన్ డి ఎక్కువైన‌ప్పుడు జీర్ణ సమస్యలు త‌లెత్తుతాయి.ముఖ్యంగా క‌డుపు నొప్పి, మ‌ల‌బ‌ద్ధ‌కం, ఆహారం త్వ‌ర‌గా జీర్ణం కాక‌పోవ‌డం వంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి.

శ‌రీరంలో విట‌మిన్ డి ఎక్కువైతే.దాని ప్ర‌భావం మృత పిండాల‌పై తీవ్రంగా ప‌డుతుంది.

ముఖ్యంగా మూత్రపిండాలు పాడయ్యే రిస్క్ ఎక్కువ‌గా ఉంటుంది.ఇక విట‌మిన్ డి అధికంగా తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో కాల్షియం శాతం పెరిగిపోతుంది.

ఫ‌లితంగా అలసట, అధిక ర‌క్త పోటు, వికారం, వాంతులు, ఆక‌లి మంద‌గించ‌డం వంటి స‌మ‌స్య‌లు కూడా ఎదుర‌వుతాయి.అందుకే శ‌రీరానికి విట‌మిన్ డి ఎంత అవ‌స‌ర‌మో.

అంతే తీసుకోవాలి.

తాజా వార్తలు