శరత్ బాబు హీరో గా చిరంజీవి విలన్ గా నటించిన ఏకైక సినిమా ఏమిటో తెలుసా..!

ప్రముఖ సినీ నటుడు శరత్ బాబు( Sarath Babu ) నేడు అనారోగ్యంతో తన తుది శ్వాసని విడిచిపెట్టిన సంగతి తెలిసిందే.ఈ విషయం తెలుసుకొని యావత్తు సినీ లోకం శోకసంద్రం లో మునిగిపోయింది, శరత్ బాబు తో తమకి ఇండస్ట్రీ లో ఉన్న అనుబంధం ని గుర్తు చేసుకుంటూ కనీళ్ళు పెట్టుకుంటున్నారు.‘రామరాజ్యం’( Rama Rajyam ) అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీ కి హీరో గా పరిచయమైనా శరత్ బాబు ఆ తర్వాత హీరో గా పలు సినిమాల్లో నటించాడు.కేవలం హీరో రోల్స్ కి మాత్రమే పరిమితం కాకుండా విభిన్నమైన పాత్రలు పోషిస్తూ అతి తక్కువ సమయం లోనే ఇండస్ట్రీ లో మంచి డిమాండ్ ఉన్న నటుడిగా మారిపోయాడు.

 Do You Know What Is The Only Movie Where Sarath Babu Is The Hero And Chiranjeevi-TeluguStop.com

అప్పట్లో డైరెక్టర్స్ ఈయనని చూసి ఇతను నిజంగానే తెలుగోడేనా, లేదా ఫారిన్ అబ్బాయా అని అనుకునేవారట.ఈ విషయాన్నీ స్వయంగా శరత్ బాబు ఒక ఇంటర్వ్యూ లో తెలిపాడు.

తెలుగు తో పాటుగా ఆయన తమిళం లో సరిసమానమైన ఇమేజి ని సంపాదించుకున్నాడు.

Telugu Days, Chiranjeevi, Balachander, Rama Rajyam, Sarath Babu-Movie

ఇది ఇలా ఉండగా శరత్ బాబు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన కొత్తల్లోనే మెగాస్టార్ చిరంజీవి ( Megastar Chiranjeevi )కూడా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాడు.శరత్ బాబు హీరోగా చేస్తున్న రోజుల్లో చిరంజీవి సైడ్ క్యారెక్టర్స్ మరియు నెగటివ్ రోల్స్ చేస్తూ ఉండేవాడు.అలా శరత్ బాబు హీరో గా నటించిన ’47 రోజులు’( 47 Days ) చిత్రం లో చిరంజీవి నెగటివ్ రోల్ లో కనిపించాడు.

లెజండరీ డైరెక్టర్ కె బాలచందర్ ( K Balachander )ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, జయప్రద హీరోయిన్ గా నటించింది.ఈ చిత్రం తెలుగులో మాత్రమే కాకుండా , తమిళం లో కూడా విడుదలై పెద్ద సూపర్ హిట్ అయ్యింది.

శరత్ బాబు పాజిటివ్ క్యారక్టర్ కి ఎంత మంచి పేరు వచ్చిందో చిరంజీవి నెగటివ్ క్యారక్టర్ కి కూడా అంతే మంచి పేరు వచ్చింది.ఈ చిత్రాన్ని చూడాలి అనుకునేవాళ్లు యూట్యూబ్ లో అందుబాటులో ఉంది వెంటనే చూసేయొచ్చు, చిరంజీవి నెగటివ్ రోల్ అందరికీ తెగ నచ్చేస్తుంది.

Telugu Days, Chiranjeevi, Balachander, Rama Rajyam, Sarath Babu-Movie

ఇక శరత్ బాబు విషయానికి వస్తే ఈయన తెలుగు లో చివరిసారిగా వెండితెర మీద కనిపించిన చిత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘వకీల్ సాబ్’ అనే చిత్రం.ఈ సినిమాలో ఆయన బార్ కౌన్సిల్ చీఫ్ గా కనిపించాడు.చాలా కాలం తర్వాత శరత్ కుమార్ కనిపించాడే అని అందరూ అనుకున్నారు.కానీ ఆ సినిమాలో ఆయన ముఖం చూసినప్పుడు అందరికీ అనుమానం వచ్చింది.ఇంత వీక్ అయ్యిపోయాడేంటి అని అందరూ అనుకున్నారు.మనిషి వీక్ అయిపోయి ఉండొచ్చేమో కానీ, ఆయన గొంతు లో ఎలాంటి మార్పు లేదు.

అప్పట్లో ఎలా మాట్లాడేవాడో ఈ సినిమాలో కూడా అలాగే మాట్లాడాడు.ఇక ఈ చిత్రం తర్వాత మళ్ళీ ఆయన వెండితెర మీద కనిపించలేదు.

ఇంతలోపే ఆయన తిరిగిరాని లోకాలకు ప్రయాణం అవ్వడం శోచనీయం.ఆయన ఆత్మ ఎక్కడ ఉన్నా శాంతిని కోరుకోవాలని మనస్ఫూర్తిగా ఆ దేవుడికి ప్రార్థన చేద్దాము.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube