ఇంటర్నెట్ ద్వారా పనిచేసే ప్రతి డివైజ్ ను ఎప్పటికప్పుడు అప్డేట్( Update ) చేయాలని బహుశా చాలామందికి తెలియదు.స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు, ఇతర ఇంటర్నెట్ ఎనేబుల్ పరికరాల సాఫ్ట్వేర్ లను( Software ) ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం కోసం ఓటీఏ ద్వారా కంపెనీల నుంచి ఎప్పటికప్పుడు అప్డేట్స్ విడుదల అవుతూనే ఉంటాయి.
కానీ చాలామంది అప్డేట్ చేస్తే అనవసరంగా డేటా వేస్ట్ అవుతుందని అప్డేట్ చేయడం వదిలేస్తారు.అసలు కంపెనీలు ఎందుకు అప్డేట్ విడుదల చేస్తాయి.
మనం అప్డేట్ చేసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అనే విషయాలు తెలుసుకుందాం.

సాధారణంగా ఏ సాఫ్ట్వేర్ లో అయినా బగ్స్( Bugs ) లేదా వివిధ లోపాలు ఏర్పడుతూ ఉండడం మామూలే.సాఫ్ట్వేర్ ను ఉపయోగిస్తున్నప్పుడు వినియోగదారులు ఎదుర్కొనే బగ్లు, సమస్యలను నివేదిస్తాయి.ఈ సమస్యను పరిష్కరించడం కోసం డెవలపర్లు అప్డేట్ లను పంపిస్తారు.
ఈ అప్డేట్లు బగ్ పరిష్కారాలు, విశ్వసనీయత, సాఫ్ట్వేర్ పనితీరును మెరుగుపరుస్తాయి.అప్డేట్ చేయడం వల్ల డివైజ్ చాలా స్మూత్ గా రన్ అవుతుంది.
అంతే కాదు గతం కంటే డివైజ్ సెక్యూరిటీ( Device Security ) బలంగా మారుతుంది.కాబట్టి డివైజ్ కు సాఫ్ట్వేర్ అప్డేట్ వస్తే వెంటనే చేసెయ్యాలి.

కొత్త టెక్నాలజీ అభివృద్ధి చెందిన తరువాత కంపెనీలు అప్డేట్ల ద్వారా సాఫ్ట్వేర్ కు కొత్త ఫీచర్లను పరిచయం చేస్తాయి.ఇది యూజర్ ఎక్స్పీరియన్స్ ను ( User Xperience ) మెరుగు పరుస్తుంది.సాఫ్ట్వేర్ ను మరింత స్పష్టమైన, సమర్థవంతమైన, యూజర్ ఫ్రెండ్లీగా చేస్తుంది.కాలక్రమేణా డెవలపర్లు సాఫ్ట్వేర్ పనితీరును ఆప్టిమైజ్ చేయడానికి మార్గాలను గుర్తించగలరు.అనవసరంగా డేటా వేస్ట్ అవుతుంది అని ఆలోచించకుండా ఇంటర్నెట్ పై పనిచేసే డివైస్ కు అప్డేట్ వస్తే వెంటనే చేసేయాలి.







