తెలుగు సినీ నటి తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా.ఈ బ్యూటీ కేవలం తన అందంతో మాత్రమే సినిమా అవకాశాలు అందుకుంది.
ఫేస్ బుక్ లో ఈమె ఫోటోలను చూసి డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ ‘అంతకుముందు.ఆ తర్వాత’ అనే సినిమాలో అవకాశం ఇచ్చారు.
ఈ సినిమా మంచి సక్సెస్ అందుకోగా ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంది.
ఇక 2018లో వరుసగా నాలుగు సినిమాలలో నటించిన ఈ బ్యూటీ అంత సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది.
ఆ తర్వాత అవకాశాలు కూడా అంతగా రాలేవు.కానీ అందం విషయంలో మాత్రం ఎంతో మంది హృదయాలను దోచుకుంది.
అందంతోనే మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.కానీ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఎప్పుడు టచ్ లోనే ఉంటుంది.
మొదట్లో ట్రెడిషనల్ లుక్ లో తెలుగు హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు అంతగా అవకాశాలను అందుకోవడం లేదు.ప్రస్తుతం ఇండస్ట్రీలో కూడా గ్లామర్ నే ఎక్కువగా ఆశిస్తున్నారు.
దీంతో చాలా మంది తెలుగు అమ్మాయిలు గ్లామర్ విషయంలో కాస్త వెనుక ఉండటంతో అవకాశాలు అందుకోలేక పోతున్నారు.
ఇక వాళ్లు కూడా తమ గ్లామర్ డోస్ ని పెంచడానికి ఫోటో షూట్లను చేయించుకుంటున్నారు.
ఈషా కూడా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.మొదట్లో ట్రెడిషనల్ లో కనిపించిన ఈ బ్యూటీ కూడా.
రాను రాను కాస్త గ్లామర్ ను పెంచుకుంది.అందం విషయంలో తగ్గేది లేదంటూ మొత్తానికి తన గ్లామర్ తో డోస్ పెంచింది.
మొత్తానికి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ల తన లుక్ ను మార్చేసింది.

హాట్ హాట్ ఫోటోలతో రచ్చ చేస్తున్న ఈ బ్యూటీ నెక్స్ట్ లెవెల్ కు వెళుతున్నట్లు అనిపిస్తుంది.ఇంతకాలానికి తన అందాలను చూసిన నెటిజనులు.ఈషా రెబ్బా లో ఇంత గ్లామర్ ఉందా అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు.
అంతేకాకుండా ఈ బ్యూటీకి అవకాశాలు ఎందుకు రావట్లేవని ప్రశ్నిస్తున్నారు.ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఇన్ స్టాలో ఒక స్టోరీ పంచుకుంది.

అందులో ఒక చిన్న పాపను ఎత్తుకొని ఫోటో దిగి ఆ ఫోటో ని షేర్ చేసుకుంది.ఇక ఆ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారగా.ఆ ఫోటోకు తెగ లైకులు, కామెంట్లు కూడా వస్తున్నాయి.ఇక ఆ ఫోటోలో ఉన్న పాప ఈశా రెబ్బ కు ఏమవుతుంది అంటే కోడలు అని తెలుస్తుంది.
మొత్తానికి తన కోడలి తో బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపించింది ఈషా.
ఇక ఇప్పుడు అడపా దడపా అవకాశాలు అందుకుంటోంది.అంతేకాకుండా పలు వెబ్ సిరీస్ లలో కూడా నటించగా అందులో మంచి సక్సెస్ లను అందుకుంటుంది.ఇక తమిళంలో కూడా ఇదివరకే ఓ సినిమాలో నటించగా.మరో అవకాశాన్ని అందుకున్నట్లు తెగ వార్తలు వినిపిస్తున్నాయి.







