Soumya Rao Jabardasth : జబర్దస్త్ కొత్త యాంకర్ సౌమ్య రావు గురించి ఈ విషయాలు తెలుసా?

జబర్దస్త్ కార్యక్రమానికి అనసూయ వెళ్ళిపోవడంతో కొద్దిరోజులపాటు ఈ కార్యక్రమానికి రష్మీ యాంకర్ గా వ్యవహరించారు.

అయితే తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయడంతో ఈ కార్యక్రమానికి కొత్త యాంకర్ వచ్చినట్లు చూపించారు.

ఇక ఈ యాంకర్ పేరు సౌమ్యరావు ఈమె వచ్చి రాగానే తనదైన స్టైల్ లో కమెడియన్లపై పంచ్ డైలాగులు వేస్తూ అందరిని సందడి చేశారు.ఇలా చూడటానికి ఎంతో అందంగా ఉన్నటువంటి ఈ సౌమ్య జబర్దస్త్ కార్యక్రమానికి కరెక్ట్ గా సరిపోతుందంటూ అందరూ భావిస్తున్నారు.

మరి జబర్దస్త్ యాంకర్ గా వచ్చినటువంటి సౌమ్యరావు ఎవరు ఏమిటి అనే విషయానికి వస్తే.సౌమ్యరావు ఎన్నో బుల్లితెర సీరియల్స్ లో నటిగా నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

ఈమె తమిళం కన్నడ సీరియల్స్ లో నటిస్తూ పేరు ప్రఖ్యాతలు పొందారు.తెలుగులో కూడా ఈమె పలు సీరియల్స్ లో సందడి చేశారు.

Advertisement

నటనపై ఆసక్తితో కన్నడ జీ తెలుగు ఛానల్ లో పట్టేదారి ప్రతిభా అనే సీరియల్ ద్వారా ఈమె బుల్లితెరకు పరిచయమయ్యారు.ఈ సీరియల్ సూపర్ సక్సెస్ కావడంతో ఈమెకు తమిళంలో కూడా అవకాశాలు వచ్చాయి.

అదేవిధంగా తెలుగు ఈటీవీ ఛానల్ లో ప్రసారమవుతున్నటువంటి శ్రీమంతుడు సీరియల్ లో ఈమె నటించే అవకాశాన్ని అందుకున్నారు.

ఇలా తెలుగు తమిళ కన్నడ బుల్లితెర సీరియల్స్ లో నటిస్తున్నటువంటి సౌమ్యరావు ఈటీవీ వారు పండుగ సందర్భంగా నిర్వహించినటువంటి ఒక స్పెషల్ షోలో కూడా సందడి చేశారు.ఈ షోలో హైపర్ ఆది ఆటో రాంప్రసాద్ లకు తనదైన స్టైల్ లో రివర్స్ పంచులు వేస్తూ పెద్ద ఎత్తున అందరిని సందడి చేయడంతో మల్లెమాల వారి కన్ను ఈమెపై పడింది.దీంతో ఈమె జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా కరెక్ట్ గా సరిపోతుందన్న ఉద్దేశంతో మల్లెమాలవారు జబర్దస్త్ కార్యక్రమానికి ఈమెను సెలెక్ట్ చేశారని తెలుస్తోంది.

చూడటానికి ఎంతో అందంగా ఉన్నటువంటి సౌమ్యరావు యాంకర్ గా బుల్లితెర ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటారో తెలియాల్సి ఉంది.

అలసిపోకుండా స్త్రీల కోరిక తీర్చే సెక్స్ రోబోట్ ... మగవారి కంటే నయం అంట
Advertisement

తాజా వార్తలు