అక్టోబర్ 14న సూర్యగ్రహణం ముగిసిన తర్వాత పాటించాల్సిన నియమాల గురించి తెలుసా..?

ముఖ్యంగా చెప్పాలంటే నామ సంవత్సర భాద్రపద బహుళ అమావాస్య అక్టోబర్ 14 శనివారం కేతుగ్రస్త కంకణాకార సూర్యగ్రహణం ( solar eclipse )ఏర్పడబోతోంది.భారత కాల మనం ప్రకారం ఈ సూర్యగ్రహణం రాత్రి 8 గంటల 34 నిమిషములకు మొదలై తెల్లవారుజామున రెండు గంటల 2.

25 నిమిషముల వరకు ఉంటుంది.ఈ సూర్యగ్రహణం పేరు, క్యూబా, జమైకా, ఉత్తర అమెరికా, కెనడా, మెక్సికో, అర్జెంటినా, కొలంబియా, బ్రెజిల్ లాంటి ప్రదేశాలలో కనిపిస్తుంది.

భారతదేశంలో ఎక్కడ సూర్యగ్రహణం కనిపించదు.అయితే గ్రహణం ఏర్పడడానికి ముందు నుంచి గ్రహణం ముగిసే వరకు ఉన్న సమయాన్ని అశుభమైన కాలంగా పరిగణిస్తారు.

ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదని పండితులు( Scholars ) చెబుతున్నారు.ఒకవేళ కాదని శుభ కార్యాలు జరిపిస్తే అశుభ ఫలితాలు వస్తాయని చెబుతున్నారు.ముఖ్యంగా చెప్పాలంటే గ్రహణ సమయం ముగిసిన తర్వాత శుద్ధి చేసుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు( Health problems ) రావని చెబుతున్నారు.

Advertisement

గ్రహణం ముగిసిన తర్వాత చేయాల్సిన పనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.సూర్యగ్రహణం లేదా చంద్రగ్రహణం ఏదైనా కానీ ముగిసిన తర్వాత ఇంటి సభ్యులందరూ శుభ్రంగా స్నానం( Bath ) చేయాలి.

సూర్యగ్రహణం ముగిసిన తర్వాత ఇంటిని శుభ్రం చేయాలి.ఆ తర్వాత ఇంట్లో గంగాజలం చల్లాలి.ఇలా చేయడం వల్ల ఇంట్లోనీ ప్రతికూలత ( Negative at home )దూరం అవుతుంది.

గ్రహణం ముగిసిన తర్వాత ఇంట్లో దేవతామూర్తుల విగ్రహాలను కూడా శుభ్రం చేసి గంగాజలం చల్లాలి.గ్రహణం తర్వాత దానం చేయడం చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు.దానం చేయడం వల్ల జీవితంలో సంతోషాలు, శ్రేయస్సు లభిస్తాయి.

గ్రహణం ముగిసిన తర్వాత ఆహార పదార్థాలలో కలిపిన గరిక లేదా తులసి ఆకులను తీసివేయాలి.గ్రహణం సమయంలో గోళ్లు కత్తిరించడం, పళ్ళను శుభ్రం చేసుకోవడం వంటివి అసలు చేయకూడదు.

మిస్టర్ బచ్చన్ ఫ్లాప్ కావడంతో డబ్బులు వెనక్కు ఇచ్చేసిన హరీష్ శంకర్.. ఎన్ని రూ.కోట్లంటే?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – సెప్టెంబర్5, గురువారం 2024

గ్రహణ సమయంలో నిద్ర పోకూడదు.గ్రహణ సమయంలో కత్తులు లేదా వస్తువులను ఉపయోగించకూడదు.

Advertisement

గ్రహణ సమయంలో పూజలు నిషిద్ధం.ఈ సమయంలో ఆహారం తినకూడదు.

గ్రహణం సమయంలో, గ్రహణం పూర్తయిన వెంటనే ఆరు బయట వెళ్లడం ఆరోగ్యానికి మంచిది కాదు.గ్రహణ సమయంలో గాయత్రి మంత్రం( Gayatri Mantra ) మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ ఉండాలి.

తాజా వార్తలు