పుట్టినరోజున రామ్ చరణ్ ధరించిన ఈ షర్టు ఖరీదు ఏంటో తెలుసా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మార్చి 27వ తేదీ తన పుట్టినరోజు వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు.ఇలా రామ్ చరణ్(Ramcharan) పుట్టినరోజు (Birthday)సందర్భంగా సౌత్ నుంచి మొదలుకొని నార్త్ సెలబ్రిటీల వరకు పెద్ద ఎత్తున ఈయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.

 Do You Know The Price Of This Shirt Worn By Ram Charan On His Birthday, Ram Char-TeluguStop.com

ఇకపోతే మరికొందరు సెలబ్రిటీలు ఏకంగా చిరంజీవి గారి ఇంటికి వెళ్లి రాంచరణ్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు.ఇలా సెలబ్రిటీలు వచ్చిన సమయంలో రామ్ చరణ్ లైట్ బ్లూ కలర్ లో ప్యాచ్ వర్క్ తో షర్ట్ లో మెగాహీరో కనిపించాడు.

ఇలా రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ధరించిన ఈ షర్టుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అయితే ఈయన ధరించిన ఈ షర్ట్(Shirt) ఖరీదు ఎంత అనే తెలుసుకొనే పనిలో అభిమానులు ఉన్నారు.ఇక ఈ షర్ట్ గురించి సెర్చ్ చేయగా ఊహించని షాక్ తగిలింది.ఫార్ ఫెచ్ అనే షాపింగ్ వెబ్ సైట్ లో ఈ షర్ట్ కనిపించింది.జున్యా వటనాబి ప్యాచ్ వర్క్ డీటైల్ షర్ట్ పేరుతో అందుబాటులో ఉంది.ఇక ఈ షర్ట్ ఏకంగా 983 డాలర్లు ఖరీదు ఉంది.భారత కరెన్సీ ప్రకారం ఈ షర్ట్ విలువ రూ.80,961 అని తెలియడంతో ఒక్కసారిగా అభిమానులు నేటిజన్స్ షాక్ అవుతున్నారు.

ఇలా రామ్ చరణ్ ధరించిన ఈ ఒక్క షర్టుతో ఒక నిరుపేద కుటుంబం ఏడాది మొత్తం ఎంతో సంతోషంగా గడపవచ్చని పలువురు భావిస్తున్నారు.ఏది ఏమైనా ఈ షర్ట్ ధర తెలిసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఇక రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి టాలీవుడ్ సెలబ్రిటీలకు పార్టీ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే.ఇక ఈ పార్టీలో ఉపాసన(Upasana) కూడా పెద్ద ఎత్తున సందడి చేశారు.

ఇక ఈ వేడుకలలో భాగంగా ఉపాసన బేబీ బంప్(Baby Bump) ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి.ఇక రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ సినిమా షూటింగ్ పనులతో బిజీగా మారిపోయారు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube