రాజమౌళిని కార్తికేయ నాన్న అని పిలవడా.. ఏమని పిలుస్తాడో మీకు తెలుసా?

ఆర్.ఆర్.ఆర్ ( RRR ) సినిమాలోని నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ అవార్డ్ వచ్చిన తర్వాత కార్తికేయ పేరు మారుమ్రోగింది.ఆస్కార్ కార్యక్రమాల కోసం 8.5 కోట్ల రూపాయలు ఖర్చు అయిందని కార్తికేయ ( Karthikeya ) వెల్లడించిన సంగతి తెలిసిందే.నేను జీవితంలో అన్నీ చూశానని టఫ్ డేస్ ఉన్న సమయంలో నేను ఏమీ ఫీల్ కాలేదని కార్తికేయ అన్నారు.

 Karthikeya Comments About Rajamouli Details, Rajamouli, Rajamouli Son, Karthikey-TeluguStop.com

నేను చిన్నప్పుడు చేసిన పార్ట్ టైమ్ జాబ్స్ కష్టం మీద చేసినవి కాదని నా ఆత్మసంతృప్తి కోసం నేను చేశానని ఆయన తెలిపారు.

రాజమౌళిని ( Rajamouli ) నేను నాన్న అని పిలవనని బాబా అని పిలుస్తానని కార్తికేయ పరోక్షంగా తెలిపారు.

పార్ట్ టైమ్ జాబ్ తో అప్పట్లో నాకు 3000 రూపాయలు చేతికి వచ్చేవని ఆయన అన్నారు.రాజమౌళి గారి నుంచి అది నేర్చుకున్నానని చెప్పవచ్చని కార్తికేయ తెలిపారు.

కార్తికేయ చాలా టాలెంటెడ్ కాగా రాబోయే రోజుల్లో కార్తికేయ దర్శకునిగా కెరీర్ ను కొనసాగిస్తారో లేక మరో రంగంలోకి ఎంట్రీ ఇస్తారో చూడాల్సి ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

రాజమౌళి గారి సక్సెస్ లో కొంత క్రెడిట్ కార్తికేయకు దక్కుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.రాజమౌళి ప్రస్తుతం మహేష్ సినిమా స్క్రిప్ట్ తో బిజీగా ఉన్నారు.గత సినిమాలను మించి ఈ సినిమాతో మెప్పించాలని రాజమౌళి సైతం భావిస్తున్నారు.

కేఎల్ నారాయణ ఈ సినిమాకు నిర్మాత కాగా చాలా సంవత్సరాల తర్వాత ఈ నిర్మాత సినిమా నిర్మాణంతో బిజీగా ఉన్నారు.

రాజమౌళి కేఎల్ నారాయణ కాంబో మూవీ బాక్సాఫీస్ ను ఏ రేంజ్ లో షేక్ చేస్తుందో చూడాల్సి ఉంది.జక్కన్నను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతుండగా మారుతున్న టెక్నాలజీలకు అనుగుణంగా అప్ డేట్ కావడం రాజమౌళికి ప్లస్ అవుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి.రాజమౌళి రెమ్యునరేషన్ భారీ రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube