తెలుగు సినీ ప్రేక్షకులు ఎంతో ఇష్టపడి ఎంతో ఆరాధించే నటి మణులలో సీనియర్ నటిమని సావిత్రి( Savitri ) ఒకరు.ఈమె వెండితెర నటిగా ఎంతో అద్భుతమైన పాత్రలలో నటిస్తూ మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు.
ఇలా నటిగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్నటువంటి సావిత్రి దాదాపు మూడు దశాబ్దాలకు పైగా హీరోయిన్గా అగ్ర హీరోలు అందరి సరసన నటించి ఇండస్ట్రీని శాసించారు.ఏ విధమైనటువంటి గ్లామర్ షో లేకుండా నిండుదనంతో దుస్తులు ధరించి కేవలం తన అందం అభినయం నటన నైపుణ్యంతో ఈమె ప్రేక్షకులను ఆకట్టుకున్నారని చెప్పాలి.

ఇప్పటికీ కూడా సావిత్రి అంటే అభిమానించే వారి సంఖ్య భారీగానే ఉంది.ఎంతోమంది సినీ తారలు ఈమెను స్ఫూర్తిగా తీసుకొని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.నటిగా ఇండస్ట్రీలో అంచెలంచలుగా ఎదిగినటువంటి ఈమె నటుడు జెమినీ గణేషన్( Gemini Ganesan ) ని పెళ్లి చేసుకున్నారు.అయితే పెళ్లి తర్వాత ఈమె వైవాహిక జీవితం సంతోషంగా సాగలేదని చెప్పాలి.
ఈగ సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతూ భారీ స్థాయిలో సంపాదించినటువంటి సావిత్రి తన డబ్బును మొత్తం ఆపదలో ఉన్నవారికి ఇస్తూ ఎంతో అండగా నిలిచేది.

ఇలా తాను సంపాదించినది మొత్తం దానధర్మాలు చేయడానికి ఖర్చు చేస్తుంది.ఇక తన భర్త జెమినీ గణేషన్ తనని మోసం చేయడంతో పూర్తిగా తాగుడుకు బానిస అయినటువంటి సావిత్రి చివరి రోజులలో చాలా దుర్భరమైనటువంటి జీవితాన్ని అనుభవించారు.ఇకపోతే తాజాగా సావిత్రికి సంబంధించినటువంటి ఒక ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సాధారణంగా ఇండస్ట్రీలో ఉన్న సెలెబ్రెటీలు అయినా సాధారణ ప్రజలైన తమ పెంపుడు జంతువులుగా ఏ కుక్కనో పిల్లినో పెంచుకోవడం మనం చూస్తూ ఉంటాము కానీ సావిత్రి మాత్రం తన పెంపుడు జంతువుగా ఒక చిరుత( Cheetha ) ను పెంచుకున్నారు.

ఇలా ఈమె చిరుతతో ఉన్నటువంటి ఒక ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియా( Social media )లో వైరల్ గా మారడంతో అందరూ షాక్ అవుతున్నారు.ఎవరైనా కుక్క లేదా పిల్లిని పెంపుడు జంతువులుగా ఎంతో ఇష్టంగా అపురూపంగా పెంచుకుంటారు కానీ సావిత్రి గారు ఏంటి ఇలా చిరుత పులిని తన పెంపుడు జంతువుగా పెంచుకున్నారు అయినా ఇలాంటి ఇష్టాలు కూడా ఉంటాయా అంటూ ఈమె ఫోటో పై కామెంట్లు చేస్తున్నారు ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక సావిత్రికి పిల్లలు జన్మించిన వారు మాత్రం ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.
కానీ జెమినీ గణేషన్ మొదటి భార్య సంతానం మాత్రం ఇప్పటికే తమ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఉన్నారని చెప్పాలి.







