ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన క్రికెట్ బోర్డ్ బీసీసీఐ నెట్ వర్త్ ఎంతో తెలుసా..?

ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన క్రికెట్ బోర్డు బీసీసీఐ అని అందరికీ తెలిసిందే.అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సైతం బీసీసీఐ కనుసన్నల్లోనే పని చేస్తోంది.

బీసీసీఐ ఒంటి చేత్తో ప్రపంచ క్రికెట్ ను శాసిస్తోంది.అందుకే బీసీసీఐ( BCCI ) తో ఏ క్రికెట్ బోర్డు కూడా కనీసం పోటీపడేందుకు కూడా ధైర్యం చేయదు.

ఏ క్రికెట్ బోర్డు కూడా బీసీసీఐ కు ఎదురు చెప్పే ప్రయత్నం కూడా చేయాదు.

బీసీసీఐ కు ఇంత ప్రత్యేక గుర్తింపు, ఇంత అత్యంత ఆదాయం రావడానికి కారణం ఐపీఎల్.బీసీసీఐ ఆదాయం పది రేట్లు పెంచింది ఐపీఎల్.ఇక బ్రాడ్ కాస్టింగ్ రైట్స్ ద్వారా బీసీసీఐకు 70 శాతం ఆదాయం సమకూరుతోంది.మరి ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన క్రికెట్ బోర్డు బీసీసీఐ నెట్ వర్త్ ఎంతంటే.2.25 బిలియన్ అమెరికా డాలర్లు.మన భారత కరెన్సీలో రూ.18,700 కోట్లు.ఇక ప్రపంచంలో రెండవ అత్యంత సంపన్నమైన క్రికెట్ బోర్డ్ గా ఆస్ట్రేలియా క్రికెట్( Australia ) బోర్డ్ నిలిచింది.

Advertisement

ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డ్ నెట్ వర్త్ 79 మిలియన్ అమెరికన్ డాలర్లు.భారత కరెన్సీలో రూ.658 కోట్లు.

రెండో స్థానంలో ఉండే ఆస్ట్రేలియా బోర్డు నెట్ వర్త్ కంటే బీసీసీఐ నెట్ వర్త్ 28 రెట్లు ఎక్కువ.బీసీసీఐకి ఇంత ఆదాయం పెరగడానికి ఐపీఎల్ కీలకంగా మారింది.ఇంగ్లాండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ 59 మిలియన్ అమెరికన్ డాలర్లతో మూడవ స్థానంలో నిలిచింది.

పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ 55 మిలియన్ అమెరికా డాలర్లతో నాలుగవ స్థానంలో నిలిచింది.ప్రస్తుతం భారత్ కు ఆతిథ్యం ఇస్తున్న సౌత్ ఆఫ్రికా( South Africa ) క్రికెట్ బోర్డ్ 45 మిలియన్ అమెరికన్ డాలర్లతో ఆరవ స్థానంలో నిలిచింది.భారత్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య జరిగే మూడు ఫార్మాట్ల సిరీస్ ల ద్వారా సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్డు నెట్ వర్త్ 68.7 మిలియన్ అమెరికన్ డాలర్లుగా మారనుంది.

ఇంట్లో ఈ వస్తువులను ఖాళీగా పెడుతున్నారా..? అయితే దరిద్రం పట్టిపీడించడం ఖాయం..!
Advertisement

తాజా వార్తలు