నిత్యం ఒక ఉడికించిన చిల‌క‌డ‌దుంప తింటే ఎన్ని ఆరోగ్య లాభాలో తెలుసా?

చిలగడదుంప.ఆంగ్లంలో స్వీట్ పొటాటో.

 Do You Know The Health Benefits Of Eating A Boiled Sweet Potato Regularly , Sw-TeluguStop.com

( Sweet potato ) పేరుకు తగ్గట్లే చిలగడదుంప స్వీట్ గా చాలా రుచిగా ఉంటుంది.అలాగే ఈ దుంపలో క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, విటమిన్ సి, విటమిన్ బి 10, విటమిన్ ఎ, ప్రోటీన్, డైటరీ ఫైబర్ ఇలా ఎన్నో పోషకాలు ఉంటాయి.

అందువల్ల నిత్యం ఒక ఉడికించిన చిలగడ దుంప ను తీసుకోవడం వల్ల బోలెడు ఆరోగ్య లాభాలు పొందవచ్చు.మరి ఇంతకీ ఆ ఆరోగ్య లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

గుండె ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాల్లో చిలగడదుంప ఒకటి.రోజుకు ఒక ఉడికించిన చిలగడదుంప తింటే అందులోని పొటాషియం మరియు విటమిన్ బి హార్ట్ ను హెల్తీగా ఉంచుతాయి.

గుండెపోటు( Heart Attack ) వచ్చే రిస్క్ ను తగ్గిస్తాయి.ఇటీవల కాలంలో చిన్నవయసులోనే చాలా మందికి కంటి చూపు మందగిస్తుంది.అయితే ఈ సమస్యకు చెక్ పెట్టడానికి చిలగడదుంప సహాయపడుతుంది.నిత్యం చిలగడ దుంపను తింటే దానిలో ఉండే విటమిన్ ఎ, బీటా కెరోటిన్లు కంటి చూపును పెంచుతాయి.

Telugu Boiledsweet, Tips, Latest, Sweet Potato, Sweetpotato-Telugu Health

ఒక ఉడికించిన చిలగడ దుంపను డైట్ లో చేర్చుకుంటే అందులోని ఫైబర్ కంటెంట్ జీర్ణవ్యవస్థను చురుగ్గా మారుస్తుంది.మలబద్ధకం సమస్యను( Constipation ) దూరం చేస్తుంది.విటమిన్ సి మరియు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ మన ఇమ్యూనిటీ సిస్టం ( Immune system )ని స్ట్రాంగ్ గా మారుస్తాయి.ఉడికించిన చిలగడ దుంపను రోజు తినడం వల్ల మన బ్రెయిన్ షార్ప్( Brain Sharp ) గా మారుతుంది.

Telugu Boiledsweet, Tips, Latest, Sweet Potato, Sweetpotato-Telugu Health

అతి ఆకలి దూరం అవుతుంది.బరువును త‌గ్గించ‌డానికి చిల‌గ‌డ దుంపలు అద్భుతంగా తోడ్పడతాయి.ఇక మధుమేహం( Diabetes ) ఉన్నవారు కూడా నిశ్చింతగా చిలగడదుంపను తినవచ్చు.ఈ దుంప తియ్యగా ఉన్న కూడా.దీనిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది.ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అందువల్ల మధుమేహులు చిలకడదుంపని తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube