తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న హీరో మహేష్ బాబు…ఈయన చేసిన సినిమాలు అన్ని సూపర్ డూపర్ సక్సెస్ లను అందుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో తండ్రికి తగ్గ తనయుడుగా కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.ఇక ఇలాంటి మహేష్ బాబు రాజకుమారుడు సినిమా( Raja Kumarudu )తో ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఈ సినిమా మాత్రం సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకుంది.
ఇక ఆ తర్వాత ఆయన చేసిన ఒకటి రెండు సినిమాలు నిరాశపర్చినప్పటికీ మురారి, ఒక్కడు లాంటి సినిమాలతో భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ లను అందుకున్నాడు.

ఇక ఇది ఇలా ఉంటే త్రివిక్రమ్ దర్శకత్వం లో అతడు సినిమా( Athadu ) చేస్తున్నప్పుడు ఈ సినిమాకు సంబంధించిన విషయాలను మహేష్ బాబు తో సపరేట్ గా డీల్ చేశాడట.దానికి సంబంధించిన విషయాల్లో వాళ్ళ తాత క్యారెక్టర్ లో శోభన్ బాబుని తీసుకుందామని త్రివిక్రమ్ మహేష్ కి చెప్పాడట.దానికి మహేష్ కూడా ఓకే అన్నాడు.
కానీ కృష్ణ వెళ్లి శోభన్ బాబుని అడిగితే శోభన్ బాబు ( Sobhan Babu )మాత్రం ఆ ఆఫర్ ని రిజెక్ట్ చేశాడు.ఇక మహేష్ బాబు మాత్రం శోభన్ బాబు ఉంటేనే సినిమా బాగుంటుందని కృష్ణ గారితో చెప్పాడట.

దానికి కృష్ణ మాత్రం శోభన్ బాబు చేయను అని చెప్పాక నేను ఏం చేయాలి అని మహేష్ బాబుతో చెప్పినప్పటికీ మహేష్ బాబు అసలు వినకుండా మారం చేసాడంట.దాంతో కృష్ణ మహేష్ బాబు మధ్య గొడవ కూడా జరిగినట్టుగా అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి.అయితే మహేష్ బాబు అలా పట్టు పట్టుకు కూర్చోవడానికి కారణం త్రివిక్రమ్ శ్రీనివాస్ అట.శోభన్ బాబు ఉంటే మన సినిమాకి ప్లస్ అవుతుందని ఆయన చెప్పిన మాటల్ని పట్టుకొని మహేష్ మనకి పక్కాగా శోభన్ బాబు కావాలి అని అడగడంతో మహేష్ బాబు కృష్ణ కి చిన్న గొడవ జరిగింది అంటూ చాలా వార్తలు వచ్చాయి…
.






