నందమూరి నటవారసుడిగా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్( NTR ) చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు.ఇక ఈయన ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్నాడు.
ఇక ఇలాంటి క్రమంలోనే ఎన్టీయార్ పాన్ ఇండియా స్టార్ గా కూడా వెలుగొందుతున్నాడు.ఇక పాన్ ఇండియా లో తన సత్తా చాటుతూ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో మరోసారి ఇండస్ట్రీ హిట్టు కొట్టాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.
ఈ సినిమాతో కనక సూపర్ సక్సెస్ కొట్టినట్లైతే టాప్ హీరోగా ఎదుగుతాడు.ఇక త్రిబుల్ ఆర్ సినిమా సక్సెస్ అయినప్పటికీ అందులో రామ్ చరణ్, ఎన్టీఆర్ ( Ram Charan, NTR )ఇద్దరు హీరోలుగా ఉన్నారు.కాబట్టి ఆ క్రెడిట్ ఇద్దరికి వెళ్లిపోయింది.కానీ ఇది సోలోగా వస్తున్న సినిమా కాబట్టి ఇది సక్సెస్ అయితే మాత్రం ఎన్టీఆర్ కి భారి క్రేజ్ రావడం అనేది పక్కా అంటూ ట్రేడ్ పండితులు ఇప్పటికే అంచనాలు వేస్తున్నారు…మరి ఇలాంటి క్రమంలో ఈ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అవుతుంది అనేది కూడా తెలియాల్సి ఉంది.
ఇక ఇది ఇలా ఉంటే ఉప్పెన సినిమాతో సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకున్న బుచ్చిబాబు( Buchi Babu Sana ) దర్శకత్వంలో ఎన్టీఆర్ ఒక సినిమా చేయాల్సి ఉంది.కానీ బుచ్చిబాబు స్టోరీ చెప్పిన తర్వాత కూడా ఎన్టీఆర్ దానిని రిజెక్ట్ చేశాడు.కారణం ఏంటి అనేది తెలియదు.మొత్తానికైతే ఆయన బుచ్చిబాబు ను రిజెక్ట్ చేశాడు.ఇక దాంతో బుచ్చిబాబు ఆ స్టోరీ ని రామ్ చరణ్ కి చెప్పి ఆయనతో సినిమా చేస్తున్నాడు…ఇక ఇది సూపర్ సక్సెస్ అవుతుందని రామ్ చరణ్ అభిమానులు కోరుకుంటున్నారు…
.