మనకి రైల్వే ప్రయాణాలు చేయడం కొత్తేమి కాదు.ఈ క్రమంలో చాలాసార్లు మనం బంధువులను పిక్ చేసుకోవడానికో, లేదంటే డ్రాప్ చేయడానికో రైల్వే స్టేషన్‌కి వెళుతూనే ఉంటాం.
ఆ సమయంలో ప్లాట్‌ఫామ్ టికెట్ అనేదానిని సాధారణంగా కొనుగోలు చేస్తుంటాం.కానీ సదరు టికెట్ గురించి మాత్రం మనకి అంత అవహగాహన ఉండదు.
కొనాలి కాబట్టి కొనేస్తుంటారు చాలామంది.అయితే అది ఎంతసేపు వ్యాలీడ్‌గా ఉంటుంది?
దానితో మనం రోజంతా ప్లాట్‌ఫామ్ పై ఉండొచ్చా? లేదంటే దీనికి సంబంధించిన పాస్‌లు ఏమైనా ఉంటాయా? ఒక వేళ ఈ టికెట్ తీసుకోకపోతే జరిమానా ఎంత విధిస్తారు? లాంటి విషయాలపైన ప్రయాణికులకు అవగాహన ఉండటం తప్పనిసరి.రైల్వే వెబ్‌సైట్ erail.in ప్రకారం.ప్లాట్‌ఫామ్ టికెట్ 2 గంటలు సమయం మాత్రమే చెల్లుబాటు అవుతుంది.అంటే దాన్ని కొనుక్కున్న తర్వాత ఓ 2 గంటల పాటు ప్లాట్‌ఫామ్‌పై ఉండొచ్చు.

ఆ సమయం మించిపోతే మాత్రం అక్కడి సిబ్బందికి జరిమానా విధించే హక్కు ఉంటుంది.ఇక ఏ ప్రాంతంలో స్టేషన్ ఉంది అనే దాన్ని బట్టి ప్లాట్‌ఫామ్ టికెట్‌ల ధర మారుతూ ఉంటుంది.ఈ మొత్తం విలువ దాదాపు రూ.10 నుంచి రూ.50 వరకు కొంచెం అటుఇటుగా ఉంటుంది.కొన్ని ప్రాంతాలలో ఉచితంగా ఇచ్చే పాస్‌లు కూడా ఉంటాయి.ఈ పాస్‌లు సాధారణంగా వివిధ ప్రభుత్వ సంస్థల ఉద్యోగులకు మాత్రమే జారీ చేస్తారు.

ఇక పెనాల్టీ విషయానికొస్తే ప్లాట్‌ఫామ్ టిక్కెట్ తీసుకోకపోతే రైల్వే టికెట్ తనిఖీ సిబ్బంది కనీసం రూ.250 వరకు జరిమానా విధించవచ్చు.ప్లాట్‌ఫామ్ టిక్కెట్ లేదా ప్రయాణ టికెట్ లేకుండా ప్లాట్‌ఫామ్‌పై ప్రయాణికుడు పట్టుబడితే ఆ జరిమానా ఇంకా పెద్దమొత్తంలో ఉంటుంది.అలాగే ఒక వ్యక్తికి ఎన్ని కావాలంటే అన్ని ప్లాట్‌ఫామ్ టికెట్‌లను జారీ చేయరు.
ప్రతి రైల్వే స్టేషన్‌కు ఈ సంఖ్య మారుతూ ఉంటుంది.ప్రతి స్టేషన్ కి ఇన్ని ప్లాట్‌ఫామ్ టిక్కెట్‌లు జారీ చేయవచ్చని వారికి ఒక పరిమితి ఉంటుంది.







