జనసేన పార్టీ కోసం భారీ విరాళం ఇచ్చిన హైపర్ ఆది... ఎంతో తెలుసా?

బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో హైపర్ ఆది ఒకరు.జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న హైపర్ ఆది ప్రస్తుతం సినిమాలలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు.

 Do You Know Hyper Adi Who Gave Huge Donation For Janasena Party ,hyper Adi Huge-TeluguStop.com

ఇకపోతే హైపర్ ఆది పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అనే విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఈయన జనసేన పార్టీకి తన మద్దతును తెలుపుతూ పార్టీ కార్యక్రమాలలో చాలా చురుగ్గా పాల్గొంటున్నారు.

గత కొద్ది రోజుల క్రితం పవన్ కళ్యాణ్ యువభేరి పేరిట నిర్వహించిన సభలో కూడా హైపర్ ఆది సందడి చేసే అధికార పక్ష నేతలపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం మనకు తెలిసిందే.

Telugu Hyper Adi, Janasena, Pawan Kalyan, Sridevidrama-Movie

ఇలా హైపర్ ఆది జబర్దస్త్ కార్యక్రమం ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్నప్పటికీ గత కొంతకాలంగా ఈ కార్యక్రమానికి దూరంగా ఉంటున్నారు.అయితే ఈయన సినిమాలతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో కూడా సందడి చేస్తూ లక్షల్లో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.ఇలా లక్షల్లో ఆదాయం పొందుతున్నటువంటి హైపర్ ఆది పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి భారీగా విరాళం ప్రకటించారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.

Telugu Hyper Adi, Janasena, Pawan Kalyan, Sridevidrama-Movie

అయితే వచ్చే ఎన్నికలలో ఈయన జనసేన పార్టీ తరఫున అసెంబ్లీ స్థానంలో పోటీ చేయబోతున్నారని తెలుస్తోంది.అందుకే ముందుగానే టికెట్ కోసం పార్టీకి భారీగా విరాళం అందించారనే వార్తలు వస్తున్నాయి.ఇలా హైపర్ ఆది జనసేన పార్టీకి భారీ విరాళం ప్రకటించారని వార్తలు వస్తున్నప్పటికీ ఎంత మొత్తంలో ఇచ్చారనే విషయం తెలియడం లేదు.దీంతో ఇది కేవలం అవాస్తవాలే అని కొందరు కొట్టి పారేయగా మరి కొందరు మాత్రం త్వరలోనే ఈ విషయం గురించి అధికారకంగా ప్రకటించబోతున్నారని తెలుస్తోంది.

మరి హైపర్ ఆది గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube