టాక్ షోలకు హాజరయ్యే సెలబ్రిటీలకు కూడా రెమ్యూనరేషన్లు ఇస్తారా?

ఈ మధ్యకాలంలో బుల్లితెరపై అలాగే, ఓటీటీలలో,అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ కూడా ఎంతోమంది సెలబ్రిటీలను ఆహ్వానిస్తూ టాక్ షోలను నిర్వహించడం లేదా సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది.

ఒకప్పుడు ఇలా సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేస్తే ఎంతో ఆసక్తిగా ఆ ఇంటర్వ్యూలను చూసేవారు.

అయితే ప్రస్తుతం ఎంతోమంది సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేస్తూ వస్తున్నారు.అయితే ఇలా యూట్యూబ్ ఛానల్ లకు టాక్ షోలకు వచ్చి ఇంటర్వ్యూలలో పాల్గొనే గెస్ట్ లకు రెమ్యూనరేషన్లు ఇస్తారా ఒకవేళ రెమ్యూనరేషన్లు ఇస్తే ఎంత మొత్తంలో రెమ్యూనరేషన్లు తీసుకుంటారనే విషయం గురించి పెద్ద ఎత్తున సందేహాలు వ్యక్తమవుతూ ఉంటాయి.

ఈ క్రమంలోనే బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి అన్ స్టాపబుల్ వంటి కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా ఆహాకు ఎంతో మంచి పబ్లిసిటీ రావడమే కాకుండా మరింత మంది సబ్స్క్రైబర్లు కూడా పెరిగారు.ఇలా టాప్ సెలబ్రిటీలను పిలవడం వల్ల వారికి ఎంతో మంచి ఆదాయం ఉంటుంది.అయితే ఇలాంటి టాక్ షోలకు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వంటి సెలబ్రిటీలు రావటం వల్ల వారికి కూడా మరింత పబ్లిసిటీ ఉంటుంది.

చంద్రబాబు నాయుడు ఈ షోకి హాజరు కావడంతో ఆయనకు రాజకీయంగా మరింత పబ్లిసిటీ వచ్చింది.అలాగే పవన్ కళ్యాణ్ కి కూడా ఇక పలువురు స్టార్ సెలబ్రిటీలు ఈ కార్యక్రమానికి హాజరు కావడంతో వారి సినిమాలకు మంచి ప్రమోషన్ అవుతుంది కనుక స్టార్ సెలబ్రిటీలు రెమ్యూనరేషన్లు తీసుకోకుండా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.ఇకపోతే ఇలాంటి టాక్ షోలకు చిన్న చిన్న సెలబ్రిటీలు కనుక వస్తే తప్పకుండా వారు రెమ్యూనరేషన్ తీసుకుంటారని చెప్పాలి.

Advertisement

అయితే సినిమాలకు తీసుకునేంత రెమ్యూనరేషన్ కాకపోయినా ఎంతోకొంత వారికి రెమ్యూనరేషన్ చెల్లిస్తుంటారు.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు