ప‌సి బిడ్డ‌ల శరీరం నుండి అవాంఛిత జుట్టును ఎలా తొలగించాలో తెలుసా?

సాధార‌ణంగా ప‌సి బిడ్డ‌ల సున్నిత‌మైన శరీరంపై పుట్టినప్పటి నుండీ అవాంఛిత జుట్టు కాస్త అధికంగానే ఉంటుంది.

ఆ జుట్టును అలానే వ‌దిలేస్తే శిశువుకు ప‌లు ర‌కాల ఇన్ఫెక్షన్  సోకే ప్ర‌మాదం ఉంటుంది.

అందుకే వాటిని తొల‌గిస్తుంటారు.కానీ, కొంద‌రు త‌ల్లుల‌కు ఈ విష‌యంపై పెద్ద‌గా అవ‌గాహ‌న ఉండ‌దు.

అస‌లు శిశువు శ‌రీరం నుండి అవాంఛిత జుట్టును ఎలా తొల‌గించాలో కూడా వారికి తెలియ‌దు.అయితే ఇప్పుడు చెప్ప‌బోయే చిట్కాల‌ను పాటిస్తే గ‌నుక చాలా అంటే చాలా సుల‌భంగా ఆ వెంట్రుకలను తొలగించవచ్చు.

మ‌రి ఆల‌స్యం ఎందుకు ఆ చిట్కాలు ఏంటో ఓ లుక్కేసేయండి.ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక స్పూన్ పెస‌ర పిండి, ఒక స్పూన్ గోధుమ పిండి, మూడు స్పూన్ల పాల మీగ‌డ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

Advertisement

బిడ్డ ఒంటికి త‌యారు చేసుకున్న మిశ్ర‌మాన్ని అప్లై చేసి.స‌ర్కిల‌ర్ మోష‌న్‌లో సున్నితంగా రుద్దాలి.

ఆపై స్నానం చేయించాలి.ఇలా ప్ర‌తి రోజు చేస్తే అవాంచిత జుట్టు క్ర‌మంగా తొల‌గి పోతోంది.

అలాగే అర క‌ప్పు ఓట్స్‌లో ఆరు జీడిప‌ప్పులు, ఆరు పొట్టు తీసిన బాదం ప‌ప్పు వేసి మెత్త‌టి పౌడ‌ర్‌లా మిక్సీ ప‌ట్టుకుని ఒక డ‌బ్బాలో స్టోర్ చేసుకోవాలి.

ప్ర‌తి రోజు ఈ పౌడ‌ర్‌లో కొద్దిగా ప‌చ్చి పాలు, ఒక స్పూన్ ఇంట్లో త‌యారు చేసుకున్న గులాబీ రేకుల పొడి వేసుకుని మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్ర‌మాన్ని బిడ్డకు స్నానం చేయించ‌డానికి ముందు ప‌ట్టించి.స్మూత్‌గా రుద్దాలి.

అభిమన్యుడి మరణం శ్రీకృష్ణుడికి ముందే తెలుసా..?
సూర్య కంగువ సినిమా మీద ఫోకస్ చేసిన అమీర్ ఖాన్...కారణం ఏంటంటే..?

ఇలా రోజూ చేస్తే అవాంఛిత జుట్టు ఊడిపోవ‌డ‌మే కాదు.శిశువు యొక్క శ‌రీరం మృదువుగా కూడా మారుతుంది.

Advertisement

ఇక రెండు స్పూన్ల ఆల్మండ్ ఆయిల్‌కు, రెండు స్పూన్ల ఆలివ్ ఆయిల్‌ను క‌లిపి బిడ్డ శ‌రీరానికి ప‌ట్టించి బాగా మ‌సాజ్ చేయాలి.రెగ్యుల‌ర్‌గా స్నానం చేయించ‌డానికి గంట ముందు ఇలా చేసినా అవాంఛిత వెంట్రుక‌లు ఊడిపోయి.

చ‌ర్మం కోమ‌లంగా త‌యారు అవుతుంది.

తాజా వార్తలు