రైతులు వ్యవసాయంలో అధిక దిగుబడి సాధించడం కోసం ఎక్కువగా రసాయన ఎరువులను వినియోగిస్తే, నేల సారవంతాన్ని కోల్పోవడంతో పాటు అనేక రకాల దుష్ఫలితాలు వస్తాయి.నేలలో ఉండే సూక్ష్మజీవుల సంఖ్య తగ్గితే భూమి సారవతాన్ని కోల్పోతుంది.
భూమి సారవంతం అనేది సూక్ష్మజీవుల పైనే ఆధారపడి ఉంటుంది.రసాయనిక ఎరువుల వాడకం చాలా వరకు తగ్గించి ఆ స్థానంలో సేంద్రియ ఎరువులను వాడడం వల్ల మొక్కకు పోషకాలు సరిగ్గా అంది, పంట నాణ్యత లో, దిగుబడిలో మంచి మార్పు వస్తుంది.

నేలలో 0.5% సేంద్రియ కర్బనం ఉంటే పంటలకు సాగు చేయడానికి ఆ నేల సారవంతమైనదిగా భావిస్తారు.ఇటీవలే వ్యవసాయ అధికారులు భూములకు భూసార పరీక్ష నిర్వహిస్తే ఏ నెలలో అయితే రసాయనిక ఎరువుల వాడకం విపరీతంగా ఉందో అ నేల సారవంతాన్ని కోల్పోయింది గా చెబుతున్నారు.ఫాస్పరస్ బ్యాక్టీరియా ను దుక్కి దున్నే టప్పుడు నెలలో వేస్తే రసాయనిక ఎరువుల భారం సగానికి పైగా తగ్గి, దిగుబడి కూడా మెరుగ్గా ఉంటుంది.
రైతులు జీవ ఎరువుల గురించి అవగాహన కల్పించుకుని వాటిని వినియోగించాలి.

పంట ఎదుగుదలలో నత్రజని, భాస్వరం, పొటాషియం లు ప్రధాన పాత్ర వహిస్తాయి.పంటలో ఏ మేరకు ఎరువులు వేసిన అందులో 30 నుంచి 35% ఎరువులు మాత్రమే మొక్క తీసుకుని మిగతాదంతా భూమిలో అలాగే ఉండడంతో జింక్ దాతువు లోపం ఏర్పడే సూచనలు ఉంటాయి.కాబట్టి రసాయన ఎరువుల స్థానంలో అధికంగా సేంద్రియ ఎరువులు, పశువుల ఎరువులు వినియోగించాలి.
కచ్చితంగా అవసరమైతే తక్కువ మోతాదులో రసాయనిక ఎరువులను వాడాలి.తద్వారా నేలలోని పోషకాలకు ఎటువంటి హాని ఉండదు.
మొక్క ఆరోగ్యంగా పెరిగి నాణ్యమైన దిగుబడి కోసం ఈ పద్ధతులు పాటిస్తే ఫలితం ఉంటుంది.







