The Kerala Story : ది కేరళ స్టోరీ సినిమా అదాశర్మ రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

ది కేరళ స్టోరీ( The Kerala Story ).

ఈ సినిమా విడుదల అయినప్పుడు నుంచి ఈ సినిమాను వరుసగా కాంట్రవర్సీలు ఒకదాని తర్వాత ఒకటి చుట్టూ ముడుతూనే ఉన్నాయి.

విడుదలైన మొదటి ఒకటి రెండు రోజుల్లోనే చాలా ప్రదేశాలలో ఈ సినిమాను థియేటర్ నుంచి తొలగించేశారు.అంతేకాకుండా ఈ సినిమాను వెంటనే ఆపేయాలి అంటూ పెద్ద ఎత్తున విమర్శలు నిరసనలు చేశారు.

తమిళనాడు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఈ సినిమాను ఏకంగా బ్యాన్ చేశారు.ఈ సినిమాకు వివాదాలే బాగా కలిసి వచ్చాయని చెప్పవచ్చు.

కొంతమంది ఈ సినిమాకు మద్దతుగా నిలుస్తుంటే మరి కొంతమంది మాత్రం ఈ సినిమాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు.దీంతో కాంట్రవర్సీలే ఈ సినిమాకు బోలెడంత పాపులారీటిని తెచ్చి పెట్టాయి.

Advertisement

కాగా ఈ సినిమా కొన్ని రాష్ట్రాలలో భారీగా కలెక్షన్స్ ను రాబడుతూ దూసుకుపోతోంది.ఇప్పటికే ఈ సినిమా దాదాపుగా 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.

రోజు రోజుకూ ఈ సినిమాకు ప్రేక్షకాదరణ పెరుగుతుండడంతో చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తుంది.లవ్ జిహాద్( Love Jihad ) నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్‏ను ఆగట్టుకుంటుంది.

డైరెక్టర్ సుదీప్తో సేన్ తెరకెక్కించిన ఈ సినిమాలో అదా శర్మ ప్రధాన పాత్రలో నటించిన విషయం తెలిసిందే.కాగా ఈ ఒక్క సినిమాతో హీరోయిన్ అదా శర్మ( Ada Sharma ) క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది.

దేశవ్యాప్తంగా ఈమెకు బీభత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏర్పడింది.కాగా ది కేరళ స్టోరీ చిత్రంలో అదా శర్మ నటనకు ప్రశంసలు అందుకుంటుంది.అంతేకాకుండా ఈ బ్యూటీకి ఇప్పుడు వరుసగా అవకాశాలు కూడా క్యూ కడుతున్నాయి.

పుష్పరాజ్ కూతురు కావేరిని తెగ ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. అసలేం జరిగిందంటే?
కాకినాడ సీపోర్ట్ వ్యవహారం .. సాయిరెడ్డి తో పాటు వీరికీ ఈడి నోటీసులు

అయితే సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన ది కేరళ స్టోరీ సినిమాకు అదా శర్మ తీసుకున్న రెమ్యూనరేషన్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చలు నడుస్తున్నాయి.దాదాపు రూ.40 కోట్ల బడ్జెట్‏తో ఈ సినిమాను నిర్మించారు.ఇక ఈ చిత్రం కోసం అదా శర్మ ఏకంగా రూ.1 కోటి పారితోషికం తీసుకుందని తెలుస్తోంది.

Advertisement

కాగా ఇందులో యోగితా బిహానీ, సిద్ధి ఇద్నానీ, సోనియా బలానీ, అదా శర్మ ప్రధాన పాత్రలలో నటించగా వీరిలో అత్యధిక రెమ్యూనరేషన్ ను హీరోయిన్ అదా శర్మ అందుకుంది.కాగా ఇందులో ఇందులో మిగతా నటీమణులు ఒక్కొక్కరు రూ.30 లక్షలు తీసుకున్నారట.ఇక విజయ్ కృష్ణకు రూ.25 లక్షలు, ప్రణయ్ పచౌరీకి రూ.20 లక్షలు, ప్రణవ్ మిశ్రాకు రూ.15 లక్షలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది.కాగా ఈ సినిమాకు ఒకవైపు వివాదాలు చుట్టుముడుతున్నా కూడా ప్రస్తుతం ఈ మూవీ థియేటర్ లాలీ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.

తాజా వార్తలు