'పోకిరి' ని తట్టుకొని ఆరోజుల్లో పవన్ కళ్యాణ్ 'బంగారం' చిత్రం ఎంత వసూళ్లను రాబట్టిందో తెలుసా..!

టాలీవుడ్( Tollywood ) లో ఇద్దరి పెద్ద హీరోల సినిమాలు ఒక వారం గ్యాప్ లో కానీ, ఒక్క రోజు గ్యాప్ లో కానీ విడుదల అవ్వడం వంటివి ఇన్ని రోజులు మనం చాలా సందర్భాలే చూసాము.ఒక సినిమాకి ఫ్లాప్ అయితే , ఒక సినిమా హిట్ అవ్వడం.

రెండు సినిమాలు ఫ్లాప్ అవ్వడం లేదా రెండు సినిమాలు హిట్ అవ్వడం ఇలాంటివి చాలానే జరిగాయి.2006 వ సంవత్సరం లో ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది.సమ్మర్ కానుకగా సూపర్ స్టార్ మహేష్ బాబు పోకిరి( pokiri ) మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బంగారం సినిమాలు కేవలం నాలుగు రోజుల తేడాతో విడుదల అయ్యాయి.

వీటిల్లో పోకిరి సినిమాకి ఇండస్ట్రీ హిట్ రేంజ్ టాక్ వచ్చింది.అప్పట్లో ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నిటినీ బద్దలు కొట్టి 34 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధించి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది.

కానీ పవన్ కళ్యాణ్ బంగారం ( bangaram )చిత్రం మాత్రం భారీ అంచనాల నడుమ విడుదలై ఫ్లాప్ టాక్ ని సొంతం చేసుకుంది.ఈ సినిమా బాగాలేదు కాబట్టి ఇన్ని రోజులు మనం ఫ్లాప్ అని అనుకుంటూ ఉన్నాము.కానీ ఈ సినిమా అదే ఫ్లాప్ టాక్ తో అప్పట్లో పోకిరి కి మించిన ఓపెనింగ్స్ ని సాధించింది అని చెప్తే ఎవరైనా నమ్ముతారా?, కానీ అదే నిజం , ట్రేడ్ పండితులు సైతం ఈ విషయాన్నీ చెప్పారు.ఒక నాలుగు వారాలు పాటు పోకిరి తో సమానమైన వసూళ్లను రాబట్టింది ఈ చిత్రం.

కానీ పోకిరి సినిమా దాదాపుగా వంద రోజులు హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ అయ్యింది అనుకోండి అది వేరే విషయం.కానీ బంగారం సినిమా టాక్ లేకపోయినా కూడా , ఒకపక్క పోకిరి మేనియా ని తట్టుకొని 18 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు సాధించిందంటే పవన్ కళ్యాణ్ స్టార్ పవర్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

Advertisement

మొదటి రోజు మరియు మొదటి వారం కలెక్షన్స్ పరంగా బంగారం లీడ్ లో ఉండగా, పోకిరి సినిమా టాక్ బాగుండడం వల్ల లాంగ్ రన్ లో ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది.ఇకపోతే బంగారం చిత్రం 150 కేంద్రాలలో 50 రోజులు మరియు 7 కేంద్రాలలో 100 రోజులు పూర్తి చేసుకుంది.మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, పోకిరి సినిమాని ముందుగా చెయ్యాల్సింది పవన్ కళ్యాణ్, డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ సినిమా స్టోరీ ని ముందుగా పవన్ కళ్యాణ్ కోసం రాసుకున్నాను అని ఎన్నో ఇంటర్వ్యూస్ లో చెప్పుకొచ్చాడు.

ఆయన ఆ పోకిరి సినిమాని వదిలేయడానికి కారణం, బంగారం చిత్రానికి డేట్స్ ఇవ్వడం వల్లే.అలా పవన్ కళ్యాణ్ మిస్ చేసుకున్న చిత్రం తోనే ఓడిపోవడం ఆశ్చర్యార్ధకం.

మళ్ళీ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ మరియు మహేష్ బాబు మధ్య బాక్స్ ఆఫీస్ వార్ జరగలేదు, ఈసారి ఇలాంటి పోటీ పడితే ఎలా ఉంటుందో చూడాలని ఈ ఇద్దరి హేరియల అభిమానులు ఎదురు చూస్తున్నారు.

వీడియో వైరల్‌ : కారుతో పెట్రోల్‌ పంప్‌ ఉద్యోగిపైకి దూసుకెళ్లిన పోలీసు..
Advertisement

తాజా వార్తలు