మెగా ప్రిన్సెస్ వరుణ్ తేజ్,హీరోయిన్ లావణ్య త్రిపాఠి( Varun tej )లు తాజాగా మూడు ముళ్ల బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.దాదాపు 5 ఏళ్లుగా ప్రేమించుకుంటూ సీక్రెట్ రిలేషన్షిప్ ని మెయింటైన్ చేస్తూ వచ్చిన ఈ జంట ఆ విషయాన్ని ఎక్కడా తెలియకుండా చాలా జాగ్రత్త పడుతూ వచ్చారు.
ఈ ఏడాది జూన్ 9న ఇరువురు కుటుంబ సభ్యుల అంగీకారంతో మెగా బ్రదర్ నాగబాబు ఇంట్లో సింపుల్ గా ఎంగేజ్మెంట్ వేడుకను నిర్వహించారు.దాంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.
ఇక తాజాగా నవంబర్ 1వ తేదీన ఇటలీలో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు ఆరేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట పెద్దల ఆశీర్వాదంతో పెళ్లి చేసుకున్నారు.

ఇటలీ( Italy )లో వీరి వివాహ వేడుక అంగరంగ వైభంగా జరిగింది.వరుణ్ పెళ్లి వేడుకకు మెగా ఫ్యామిలీ అంతా వచ్చారు.మెగాస్టార్ చిరంజీవి దంపతులతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ , ఉపాసన దంపతులు కూడా హాజరయ్యారు.
ఇంకా చాలామంది మెగా కుటుంబ సభ్యులు అలాగే లావణ్య త్రిపాఠి తల్లిదండ్రులు స్నేహితులు బంధువులు పలువురు సెలబ్రిటీలు సైతం ఈ పెళ్లి వేడుకకు హాజరయ్యారు.ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో లావణ్య, వరుణ్ తేజ్ లకు సంబంధించిన పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పాటు ఈ జంటకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే లావణ్య తల్లిదండ్రులు అల్లుడు వరుణ్ తేజ్ కు కట్న కానుకలు ఎంత ఇచ్చారు అన్న విషయం హాట్ టాపిక్ గా మారింది.ఆరు సంవత్సరాలు ప్రేమించి పెళ్లి చేసుకున్న వరుణ్, లావణ్య పేరెంట్స్ దగ్గర ఎలాంటీ కట్నం తీసుకోలేదని తెలుస్తోంది.అంతేకాదు పెళ్లి ఖర్చు కూడా అంత వరుణే పెట్టుకున్నట్లు సమాచారం.అయితే లావణ్య( Lavanya Tripathi ) తల్లిదండ్రులు మాత్రం లావణ్యకు కొంత బంగారాన్ని, పెళ్లికి ఒక పట్టు చీరను బహుమతులుగా ఇచ్చారట.
అలాగే వరుణ్ తేజ్ పెళ్లికి సంబంధించిన పెళ్లి కార్డు ధర గురించి కూడా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వరుణ్ తేజ్ పెళ్లి కార్డు ఖర్చుతో ఒక మధ్యతరగతి కుటుంబంలో పెళ్లి చేయొచ్చని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఆ పెళ్లి కార్డు ఏకంగా 6 లక్షలు పెట్టి డిజైన్ చేయించారట.అందుకే ఒక పెళ్లి కార్డుకే దాదాపుగా 6 లక్షల వరకు ఖర్చు పెట్టారట.అంతేకాకుండా లావణ్య తల్లిదండ్రులు కూడా బంగారాన్ని బాగానే ముట్ట చెప్పినట్టు తెలుస్తోంది. బంగారం విలువ కోట్లలో ఉంటుది అన్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.







