చీక‌ట్లో మొబైల్ వాడ‌టం వ‌ల్ల ఎన్ని న‌ష్టాలో తెలుసా?

ప్ర‌పంచ‌వ్యాప్తంగా మొబైల్స్( Mobiles ) వాడ‌కం ఎంత‌లా పెరిగిపోయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.ప్రతి ఒక్కరి జీవితంలో మొబైల్ కీలకమైన భాగం అయిపోయింది.

మొబైల్స్ ద్వారా కమ్యూనికేషన్ సులభతరం అయింది.వినోదానికి వేదిక అయింది.

అలాగే జ్ఞానానికి పెంచుకునేందుకు, డిజిటల్ బ్యాంకింగ్, నావిగేషన్, షాపింగ్‌.ఇలా మొబైల్స్ తోనే అనేక ప‌నుల‌ను పూర్తి చేస్తున్నారు.

సమాచార సాంకేతికతలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన మొబైల్ ను క్ష‌ణం కూడా వ‌దిలిపెట్టేందుకు ఎవ‌రూ ఇష్ట‌పడ‌టం లేదు.అయితే మొబైల్స్ వాడ‌కం వ‌ల్ల అనేక ప్రయోజనాలే కాదు దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి.

Advertisement
Do You Know How Much Damage Is Caused By Using A Mobile In The Dark? Mobile, Eye

ముఖ్యంగా చీక‌ట్లో మొబైల్ వాడే వారు క‌చ్చితంగా కొన్ని విష‌యాలు తెలుసుకోవాలి.మ‌న‌లో చాలా మంది రాత్రుళ్లు చీక‌ట్లో ఫోన్ ( Phone in the dark )ఉప‌యోగిస్తుంటారు.

నిద్ర స‌మ‌యాన్ని వృధా చేస్తూ వీడియోలు చూడడం, పాటలు వినడం, చాటింగ్, గేమ్స్ ఆడ‌టం వంటి చేస్తుంటారు.చీకట్లో ఫోన్ వాడటం వల్ల వివిధ రకాల నష్టాలు ఉంటాయి.

చీకట్లో ఫోన్ యూజ్ చేయ‌డం వ‌ల్ల స్క్రీన్ నుండి వచ్చే నీలి కాంతి మెలటోనిన్ ఉత్పత్తిని ( Melatonin production ) అడ్డుకుంటుంది.ఇది నిద్రకు అంతరాయం కలిగిస్తుంది.

ఫ‌లితంగా నిద్ర‌లేమికి గుర‌వుతారు.

Do You Know How Much Damage Is Caused By Using A Mobile In The Dark Mobile, Eye
నా హైట్ తో సమస్య.. నాతో మాట్లాడేవాళ్లు కాదు.. మీనాక్షి చౌదరి షాకింగ్ కామెంట్స్ వైరల్!
మలబద్ధకాన్ని తరిమికొట్టే బెస్ట్ డ్రింక్స్ ఇవి.. రోజు తీసుకుంటే మరెన్నో లాభాలు!

అలాగే చీకట్లో మొబైల్ స్క్రీన్‌లో వెలుతురు ఎక్కువగా ఉండడం వ‌ల్ల కన్నులపై ఒత్తిడి పెరుగుతుంది.దీని వలన దృష్టి సమస్యలు త‌లెత్తుతాయి.డ్రై ఐ సిండ్రోమ్, దృష్టి క్షీణత, కంటి అలసట( Dry eye syndrome, visual impairment, eye fatigue ) లాంటి వాటిని ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Advertisement

నిత్యం చీకట్లో ఫోన్ వాడితే కన్నులు దూరాన్ని సరిగ్గా చూడలేకపోవడం, విజువ‌ల్స్ తప్పుగా ఫోకస్ కావడం వంటి సమస్యలు కలుగుతాయి.

అంతేకాకుండా చిక‌ట్లో ఫోన్ వాడటం వల్ల మనసిక మరియు శారీరక ఆరోగ్య సమస్యలు వస్తాయి.ఎక్కువగా ఫోన్ వాడటానికి అలవాటు పడటం వల్ల ప్రపంచానికి, ఇతరులకి కనెక్ట్ అవ్వడం తగ్గుతుంది.కుటుంబం, స్నేహితులతో గ‌డిపే విలువైన సమయాన్ని కోల్పోతారు.

కాబట్టి, ఫోన్ వాడకానికి రోజులో కొన్ని గంటలు మాత్రమే కేటాయించండి.చిక‌ట్లో ఫోన్ వాడే అల‌వాటును మానుకోండి.20-20-20 నియమాన్ని అనుసరించండి.ప్రతి 20 నిమిషాలకు, మీ స్క్రీన్ నుండి దూరంగా చూసి, 20 సెకన్ల పాటు 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువుపై దృష్టి పెట్టండి.

నిద్రకు కనీసం ఒక‌ గంట ముందు ఫోన్ వాడటం మానేయండి.

తాజా వార్తలు