వామ్మో.. కరక్కాయతో ఇన్ని ప్రయోజనాలా?.. తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Do You Know How Many Ways To Use Myrobalan For Health?,Myrobalan, Myrobalan Benefits, Latest News, Karakkaya, Health, Health Tips, Good Health, Karakkaya Health Benefits

కరక్కాయ( Karakkaya ). దీని గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు.

 Do You Know How Many Ways To Use Myrobalan For Health?,myrobalan, Myrobalan Bene-TeluguStop.com

బిర్యాని, నాన్ వెజ్ వంటల్లో కరక్కాయను విరివిరిగా వాడుతుంటారు.అయితే కరక్కాయ వంటలకు మాత్రమే ఉపయోగపడుతుంది అనుకుంటే పొరపాటే.

కరక్కాయలో ఎన్నో విలువైన ఔషధ గుణాలు నిండి ఉంటాయి.అవి మన ఆరోగ్యానికి అపారమైన ప్రయోజనాలను చేకూరుస్తాయి.

అస‌లు కరక్కాయతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు.

Telugu Tips, Karakkaya, Latest, Myrobalan-Telugu Health

జలుబు దగ్గు<( Cold,Cough )/em> సమస్యలకు కరక్కాయ దివ్య ఔషధంలా పనిచేస్తుంది.అందుకోసం పావు టేబుల్ స్పూన్ కారకాయ పొడికి పావు టేబుల్ స్పూన్ అల్లం పొడి మరియు వ‌న్ టేబుల్ స్పూన్ తేనె కలిపి రోజుకు రెండుసార్లు తీసుకోవాలి.ఇలా చేస్తే దగ్గు జలుబు దెబ్బకు పరార్ అవుతాయి.

అలాగే అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారికి కూడా కరక్కాయ ఉపయోగపడుతుంది.అందుకోసం ఒక గ్లాస్ వాటర్ లో పావు టేబుల్ స్పూన్ కరక్కాయ పొడి( Haritaki Powder , అర టేబుల్ స్పూన్ తాటి బెల్లం పొడి వేసి బాగా మరిగించాలి.

ఆ వాటర్ ను ఫిల్టర్ చేసుకుని రోజుకు ఒకసారి తీసుకోవాలి.ఇలా చేస్తే వేగంగా బరువు తగ్గుతారు.పైగా నీరసం, అలసట, ఆయాసం వంటి సమస్యలు దూరం అవుతాయి.రక్తహీనత నుంచి విముక్తి లభిస్తుంది.

మలబద్ధకం సైతం దూరం అవుతుంది.

Telugu Tips, Karakkaya, Latest, Myrobalan-Telugu Health

చాలామంది డార్క్ సర్కిల్స్( Dark Circles ) తో సతమతం అవుతుంటారు.అయితే నల్లటి వ‌ల‌యాలను వదిలించడానికి కరక్కాయ అద్భుతంగా ఉపయోగపడుతుంది.అందుకోసం వన్ టేబుల్ స్పూన్ కరక్కాయ పొడిలో మూడు టేబుల్ స్పూన్లు పచ్చి పాలు వేసి బాగా మిక్స్ చేసి కళ్ళ చుట్టూ అప్లై చేసుకోవాలి.

పూర్తిగా డ్రై అయిన తర్వాత వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.రోజుకు ఒకసారి ఇలా కనుక చేస్తే నల్లటి వలయాలు వారంలో మాయం అవుతాయి.

ఇక మోకాళ్ళ నొప్పులు( Knee Pain ) నివారించడానికి కూడా కరక్కాయ సహాయపడుతుంది.అందుకోసం వన్ టేబుల్ స్పూన్ కరక్కాయ పొడిలో రెండు టేబుల్ స్పూన్ల ఆముదం కలిపి మోకాళ్ళపై అప్లై చేసుకుని మర్ద‌నా చేసుకోవాలి.

రోజుకు ఒకసారి ఇలా చేస్తే మోకాళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube