అండర్-19 ప్రపంచకప్ టైటిల్( Under-19 World Cup title ) ఫేవరెట్ గా బరిలోకి దిగిన భారత యువ జట్టు అద్భుత ఆట ప్రదర్శనతో ఓటమి అనేది ఎరుగకుండా ఫైనల్ చేరింది.సెమీ ఫైనల్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా జట్టును చిత్తుగా ఓడించి ఫైనల్ పోరు అర్హత సాధించింది.
భారత జట్టు ఇప్పటివరకు ఎన్నిసార్లు ఫైనల్ కు అర్హత సాధించింది.ఎన్నిసార్లు ఫైనల్ గెలిచి విజేతగా నిలిచింది.
ఎన్నిసార్లు రన్నరప్ గా నిలిచింది వివరాలను తెలుసుకుందాం.

భారత జట్టు( Indian team ) ఇప్పటివరకు 14 అండర్-19 ప్రపంచకప్ టోర్నీలలో పాల్గొని ఐదుసార్లు విజేతగా నిలిచింది.మూడుసార్లు రన్నరప్ గా నిలిచింది.భారత జట్టు మహమ్మద్ కైఫ్ నాయకత్వంలో 2000 సంవత్సరంలో తొలిసారి అండర్-19 ప్రపంచ కప్ విజేతగా నిలిచింది.ఫైనల్లో శ్రీలంకను( Sri Lanka ) ఓడించింది.2008లో విరాట్ కోహ్లీ నేతృత్యంలో భారత యువ జట్టు సౌత్ ఆఫ్రికా పై విజయం సాధించి అండర్-19 ప్రపంచకప్ విజేతగా నిలిచింది.

మూడోసారి 2012లో భారత యువ జట్టు ఆస్ట్రేలియాను( Australia ) చిత్తుగా ఓడించి ప్రపంచ కప్ విజేతగా నిలిచింది.నాలుగో సారి 2018లో భారత యువ జట్టు ఆస్ట్రేలియను ఓడించి ప్రపంచకప్ విజేతగా నిలిచింది.2022లో భారత యువజట్టు ఇంగ్లాండ్ ను చిత్తుగా ఓడించి ప్రపంచ కప్ విజేతగా నిలిచింది.ఐదు సార్లు అండర్-19 ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత జట్టు తాజాగా ఆరోసారి విశ్వవిజేతగా నిలిచేందుకు రెడీ అయింది.
ఇక భారత జట్టు 2006, 2016, 2020 లలో రన్నరప్ గా నిలిచింది.ఫిబ్రవరి 8వ తేదీ ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది.
ఈ మ్యాచ్లో గెలిచిన జట్టుతో భారత్ తుది పోరులో తలపడనుంది.







