దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజా( Ilayaraja ) డైరెక్టర్ వంశీతో కలిసి చాలానే సినిమాల్లో పని చేశాడు.వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలలోని పాటలు అత్యంత మధురంగా ఉంటాయని చెప్పుకోవచ్చు.ఆ పాటలు పెద్ద మ్యూజికల్ హిట్స్ గా కూడా నిలిచాయి.1984లో ‘సితార’( Sitara ) సినిమాతో వీరి కాంబో ప్రారంభమైంది.ఈ డ్యూయో 1992లో ‘డిటెక్టివ్ నారద’ వరకు చాలా సినిమాలకు కలిసి వర్క్ చేశారు.ఆ సినిమాలు కమర్షియల్ సక్సెస్ తో సంబంధం లేకుండా పాటలతో బాగా ఆకట్టుకున్నాయి.
వంశీ సినిమా అనగానే ఇళయరాజా కంపోజ్ చేసిన పాటలే అందరికీ గుర్తొచ్చేవి.ప్రతి వంశీ( Director Vamsi ) సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజానే అని ప్రతి ప్రేక్షకుడు భావించేలా వారి కాంబో రిపీట్ అయింది.
కానీ కొంతకాలానికి ఊహించని విధంగా వీరు కలిసి పనిచేయడం ఆపేశారు.ఇళయరాజా విడిపోయాక స్వయంగా వంశీనే మ్యూజిక్ డైరెక్టర్‌గా అవతారమెత్తి ఆశ్చర్యపరిచాడు.
అయితే కొన్ని ఏళ్లకు ఇళయరాజా లాంటి పాటలే తన సినిమాలో ఉండాలని భావించి చక్రిని( Chakri ) మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నాడు.

మరి ఇళయరాజా వంశీ సినిమాలకు మ్యూజిక్ కంపోజ్ చేయనని చెప్పడానికి కారణం ఏంటి? తెలుసుకుందాం పదండి.ఇళయరాజా ఎందుకు తన సినిమాలో పనిచేయడం మానేశారనే దానిపై ఒక ఇంటర్వ్యూలో వంశీ మాట్లాడాడు.ఆయన ప్రకారం, ఇళయరాజా తనని ఓ కుమారుడిగా ఎంతో ఆత్మీయంగా చూసుకునేవాడు.
అయితే ఇతర విషయంలో మాత్రం కాస్త అహంకారిగా ప్రవర్తించేవాడు.వంశీ ఎన్ని ట్యూన్స్ కావాలని అడిగితే అన్ని ట్యూన్స్ వెంటనే కంపోజ్ చేసి ఇచ్చేవాడు.

మూములుగా ఇతర డైరెక్టర్ల సినిమాల్లో ఐదు పాటలు ఉంటే ఇళయరాజా కేవలం ఐదు ట్యూన్లే ఇచ్చేవాడట.కానీ వంశీ సినిమాలోని సింగిల్ సాంగ్ కోసం 100 ట్యూన్లు కట్టిన సందర్భాలు కూడా ఉన్నాయట.సినిమాల సమయంలో ఒకరికొకరు సపోర్టుగా ఉండటం వల్లే తమ మధ్య మంచి స్నేహం ఏర్పడిందని వంశీ తెలిపాడు వీరిద్దరూ కలిసి ట్రావెలింగ్ కూడా బాగా చేస్తూ పరిచయం మరింత పెంచుకున్నారు.అయితే ఆ సమయంలో ఒక నిర్మాత( Producer ) ఇళయరాజాతో మ్యూజిక్ చేయించుకొని తక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చాడట.
ఇదేంటి ఇంత తక్కువ ఇచ్చారు అంటే సినిమా పాలసీ ప్రకారం అంతే ఇస్తామని తాగేసి చెప్పారట.

దాంతో “ఈ మాత్రం డబ్బులు నాకెందుకు అని, మీరే తీసుకెళ్లండి.” అని ఇళయరాజా ఆగ్రహించాడట.ఆ తర్వాత నిర్మాతల దగ్గర డబ్బులు విషయంలో కచ్చితంగా ఉండాలని అనుకున్నారట.
అదే సమయంలో డైరెక్టర్ వంశీ “జోకర్” సినిమా( Joker Movie ) మొదలుపెట్టాడు.అయితే ఇళయరాజా జోకర్ సినిమాకి గానూ భారీ రెమ్యూనరేషన్ అడిగాడట.
నిర్మాత అంత ఇచ్చుకునే స్థాయిలో లేడని అర్థం చేసుకున్న వంశీ ఇక చేసేది లేక తానే ఆ మూవీకి మ్యూజిక్ అందించాడు.ఆ విధంగా వీరి కాంబోకి బ్రేక్ పడింది.
మరోవైపు వంశీ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు.







