తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
ఇక జూనియర్ ఎన్టీఆర్ కు ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఎన్టీఆర్ పేరు చెప్పినా, తెరపై ఆయన కనిపించినా అభిమానులు పూనకాలతో ఊగిపోతారు.
కాగా ఇటీవలే తారక్ ఆర్ఆర్ఆర్ సినిమాతో( RRR ) పాన్ ఇండియా హిట్ కూడా అందుకున్న విషయం తెలిసిందే.ఆర్ఆర్ఆర్ సినిమా పాన్ ఇండియా మూవీ అయినప్పటికీ ఈ సినిమాతో తారక్ క్రేజ్ ప్రపంచం మొత్తం వ్యాపించింది.
జపాన్ లోనూ తారక్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ అయ్యింది.ఈ తరంలో తారక్ లా డైలాగ్ చెప్పే నటుడు లేరు అంటే అది అతిశయోక్తి కాదు.అయితే ఎన్టీఆర్ కేవలం హీరోగా మాత్రమే కాకుండా సింగర్ గా( Singer ) కూడా అలరించారు అన్న విషయం చాలామందికి తెలియదు.అంతేకాకుండా కొన్ని సినిమాలలో ఆయన వాయిస్ ని కూడా వినిపించారు.
అసలు తారక్ మొత్తం ఎన్ని సినిమాల్లో పాటలు పాడారు అన్న విషయం చాలా మందికి తెలియదు.అయితే తారక్ ఇప్పటివరకు ఆరు సినిమాల్లో తన వాయిస్ వినిపించారు.
దర్శక ధీరుడు రాజమౌళ తెరకెక్కించిన యమదొంగ సినిమాలో( Yamadonga ) ఓలమ్మి తిక్కరేగిందా అనే పాట ఎన్టీఆర్ పాడారు.
ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించారు.ఆ తర్వాత మణిశర్మ సంగీతం అందించిన కంత్రి సినిమాలో( Kantri Movie ) టైటిల్ ట్రాక్ పాడారు తారక్.అలాగే రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ అదుర్స్ సినిమాలో( Adhurs ) ఎన్టీఆర్ చేత ఓ పాట పాడించారు.
సాంగ్ సూపర్ హిట్ అయ్యింది.వీవీ వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.
రభస( Rabhasa ) అనే సినిమాలో తమన్ సంగీత సారథ్యంలో అచ్చ తెలుగు ఆడపిల్లలా అనే పాటను పాడారు ఎన్టీఆర్.ఇక మరోసారి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన నాన్నకు ప్రేమతో( Nannaku Prematho ) సినిమాలో ఫాలో ఫాలో సాంగ్ పాడారు ఎన్టీఆర్.
తెలుగులోనే కాదు కన్నడ భాషలోనూ ఒక పాట పాడారు తారక్.దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ హీరోగా నటించిన సినిమాలోనూ ఎన్టీఆర్ సాంగ్ పాడారు.
ఇలా సింగర్ గాను తారక్ అభిమానులను ఆకట్టుకున్నారు.ఇలా కేవలం హీరోగా మాత్రమే కాకుండా సింగర్ గా కూడా మంచి గుర్తింపుని ఏర్పరచుకున్నారు.