పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్( Pawan Kalyan, Sai Dharam Tej ) కాంబినేషన్ లో వచ్చిన బ్రో మూవీ( Bro movie ) ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ ని సొంతం చేసుకుంటుంది కానీ పూర్తి స్థాయి హిట్ అనే ఫలితం తెలియాలంటే మరొక రోజు ఆగాల్సిందే.ఇక ఈ సినిమాలో మాతృక వినోదయ సీతం కి చాల తేడాలు ఉన్నాయ్.
ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఎంట్రీ వల్ల సినిమా స్థాయి, బడ్జెట్, చూపించే యాంగిల్ అన్ని మార్చేశాడు దర్శకుడు.దీనికి కారణం ఖచ్చితంగా త్రివిక్రమ్ అని చెప్పవచ్చు.
ఎందుకు అంటే కథ, కథనం అంత ఆయనే కాబట్టి.ఇక పవన్ కళ్యాణ్ బ్రో సినిమాలో తన పాత సినిమాల నుంచి రెఫరెన్సెస్ తీసుకొని ఈ సినిమాలో ట్రై చేసారు.

అందులో ఒకటి తమ్ముడు( Tammudu ) సినిమాలో వయ్యారి భామ అంటూ పాట పాడుతూ హీరోయిన్ వెనక పడే కూలి పాత్ర.ఈ వేషం బ్రో సినిమాలో కూడా ట్రై చేసారు.అంతే కాదు మూవీ హైలెట్ సీన్స్ లో ఇది కూడా ఒకటి అని చెప్పవచ్చు.అయితే ఈ లుక్ వెనక మరొక ఇంట్రెస్టింగ్ కథ కూడా ఉంది.
అదేంటంటే, బ్రో మూవీ లో పవన్ కళ్యాణ్ కూలి వేషం లో వచ్చినప్పుడు అయన చేతికి ఒక లేబర్ లైసెన్స్ లాంటి బిళ్ళ ఉంటుంది.ఇది జాగ్రత్తగా గమనిస్తే జనసేన యొక్క లోగో లో ఉండే చక్రం.
దీనిని చాల స్పెషల్ గా తాయారు చేయించారట చిత్ర బృందం.దీనిని ఆంధ్రప్రదేశ్ లో గల తెనాలి పట్టణం లో ఒక ఫెమస్ స్వర్ణకారుల దగ్గర బంగారం తో చేయించారట.
సౌమరౌతు బ్రహ్మం( Soumarauthu Brahman ) మరియు అనురాధ అనే స్వర్ణకారులు సిల్వర్ అండ్ గోల్డ్ వర్క్ షాప్ తెనాలి లో నడిపిస్తుండగా, వారి దగ్గరే ఈ బిళ్ళ తయారు చేయించారట.

ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.అంతే కాదు ఈ మ్యాటర్ తెలిసిన జనసైనికులు పండగ చేసుకుంటున్నారు .సినిమాకు ఒక వైపు పాజిటివ్ టాక్ వస్తుండటం, రెండు రోజుల నుంచి తడిచి ముద్దైన తెలుగు రాష్ట్రాలు ఈ సినిమా కోసం పరుగులు పెట్టడం చూస్తే పవన్ కళ్యాణ్ ఖాతాలో మరొక విజయం పడింది అని సంబరాలు చేసుకుంటున్నారు.ఇక పవన్ కి ఇలా ఎవరో ఒకరి ట్యాలెంట్ తన సినిమా ద్వారా పరిచయం చేయడం కొత్తేమి కాదు.భీమ్లా నాయక్ లో మొగిలయ్య అనే కళాకారున్ని పరిచయం చేయగా అయన పద్మశ్రీ అందుకున్నారు .