మెహర్ రమేష్ తీసిన ఈ రెండు సూపర్ హిట్ సినిమాల గురించి మీకు తెలుసా ?

మెహర్ రమేష్( Meher Ramesh ) తాను డైరెక్ట్ చేసిన ప్రతి హీరోకి తమ కెరీర్లోనే అతి పెద్ద డిసాస్టర్ ని గిఫ్టుగా ఇచ్చాడన్న ఒక చెత్త రికార్డు ఉంది.

పాపం ఈ డైరెక్టర్ గత 10 ఏళ్లుగా ఒక సాలిడ్ హిట్ కొట్టేందుకు తెగ కష్టపడుతున్నాడు.

కానీ విజయం మాత్రం ఆయన చెంత చేరడం లేదు.అదే ఆశతో తాజాగా మెగా స్టార్ చిరంజీవితో తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకునే ప్రయత్నం చేసాడు మెహర్ రమేష్.

మెహర్ రమేష్, చిరంజీవి కాంబోలో వచ్చిన చిత్రం "భోళాశంకర్"( Bhola Shankar ).తమిళ్ లో అజిత్ హీరోగా తెరకెక్కిన "వేదాళం" రీమేక్ ఈ చిత్రం.ఈ సినిమా బ్లాక్బస్టర్ హిట్ అవుతుందనే అంచనాలు ప్రేక్షకులలో పెద్దగా లేకపోయినప్పటికీ చిరంజీవి కెరీర్ లోనే అతి పెద్ద డిసాస్టర్ గా నిలుస్తుందని మాత్రం ఎవ్వరు ఊహించివుండరు.

ఈ చిత్రం అభిమానులను బాగా డిసప్పోఇంట్ చేసింది.

Advertisement

మహేష్ బాబు నటించిన బాబీ సినిమాతో యాక్టరుగా పరిశ్రమలో అడుగుపెట్టిన మెహర్ రమేష్ తరువాత డైరెక్టర్ గా మారాడు.తెలుగులో మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఐదు సినిమాలలో కేవలం "బిల్లా" చిత్రం మాత్రమే యావరేజ్ టాక్ సంపాదించింది.మిగిలిన నాలుగు చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్లుగా మిగిలాయి.

ఐతే ప్లాప్ సినిమాలకు కేర్ అఫ్ అడ్రస్ గ మారిన మెహర్ రమేష్ తనడిరెక్షన్ కెరీర్ ని మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ తోనే మొదలుపెట్టాడు.మెహర్ రమేష్ తెలుగులో దర్శకత్వం వహించిన మొదటి సినిమా కంత్రి.

కానీ ఈ చిత్రానికి ముందు ఆయన కన్నడలో రెండు సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు.

మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన మొదటి చిత్రం "వీర కన్నడిగ".ఈ చిత్రం పూరి జగన్నాథ్, జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన "ఆంధ్రావాలా" చిత్రం కన్నడ రీమేక్.ఈ చిత్రంలో కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ హీరోగా నటించారు.

నైజాంలో కంగువకు భారీ షాక్.. పుష్ప ది రూల్ కు సైతం ఇబ్బందులు తప్పవా?
అమ్మాయి కనపడితే ముద్దయినా పెట్టాలి ?కడుపైనా చేయాలన్న బాలయ్య జైల్లో పెట్టారా : పోసాని

ఈ సినిమా కన్నడలో బ్లాక్బస్టర్ అయ్యింది.మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన రెండొవ చిత్రం "అజయ్".

Advertisement

ఇది తెలుగులో సూపర్ హిట్ అయిన "ఒక్కడు" సినిమా రీమేక్.ఈ చిత్రం కూడా కన్నడలో సూపర్ హిట్ అయ్యింది.

ఇలా కన్నడలో రెండు బ్యాక్ తో బ్యాక్ బ్లాక్బస్టర్ హిట్స్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్ తెలుగులో మాత్రం డిజాస్టర్లను మూటగట్టుకున్నాడు.

తాజా వార్తలు