మన దేశంలోనే అతిపెద్ద శివలింగం ఉన్న దేవాలయం గురించి తెలుసా..?

మన భారతదేశంలోని అతిపెద్ద శివలింగం తంజావూరులోని బృహదీశ్వరాలయం( Brihadeeswara )లోనే లోనిదే అని చాలామంది చెబుతూ ఉంటారు.

కానీ అంతకంటే పెద్ద శివలింగం ఉన్న మరో దేవాలయం మనదేశంలోనే ఉంది అని దాదాపు చాలా మందికి తెలియదు.

ఎన్నో వందల సంవత్సరాల క్రితం నిర్మితమైన నేటికీ పరిశోధకులకు సవాల్ విసురుతున్న అరుదైన విశేషాలు ఉన్న విశిష్ట దేవాలయమే భోజేశ్వర దేవాలయం ( Bhojeshwar Temple )అని పండితులు చెబుతున్నారు.ఇంతకూ ఆ దేవాలయం ఎక్కడుంది? దాని విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.ఆలయం మధ్యప్రదేశ్ లోని రైసన్ జిల్లాలో ఉంది.

రాజధాని భోపాల్( Bhopal ) నుంచి 30 కిలోమీటర్ల దూరంలో బేత్వా (బేత్రావతి) నది తీరంలోని భోజపురి గ్రామంలోని ఈ దేవాలయానికి 1000 సంవత్సరాల చరిత్ర ఉంది.క్రీస్తు శకం 1000 ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని పాలించిన పరమర వంశయుడైన భోజరాజు ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు చరిత్రలో ఉంది.ఈ దేవాలయంలోని శివలింగం దేశంలోని అత్యంత ఎత్తైన శివలింగంగా గుర్తింపు పొందింది.18 అడుగుల ఎత్తు 7.5 అడుగుల చుట్టుకొలత ఉన్న ఈ లింగాన్ని ఒకే రాతిలో మలిచారు.ఈ దేవాలయాన్ని 16 అడుగుల పొడవు, 77 అడుగుల వెడల్పు, 17 అడుగుల ఎత్తున పీఠం మీద నిర్మించారు.

స్థల పురాణం ప్రకారం వనవాస సమయంలో ఒక చోటి నుంచి మరొక చోటికి ప్రయాణించే క్రమంలో ఇక్కడికి రాగానే పాండవుల తల్లి అయిన కుంతీదేవి పరమేశ్వరుడిని ఆరాధించేందుకు ఒక దేవాలయాన్ని నిర్మించాలని పాండవులను కోరింది.దీంతో వారు ముందుగా ఇక్కడి భారీ శివలింగాన్ని ప్రతిష్టించి తర్వాత శివాలయాన్ని పూర్తి చేసే క్రమంలో అక్కడి నుంచి వేరే చోటికి వెళ్లి పోవాల్సి వచ్చిందని పురాణాలలో ఉంది.అందుకే ఈ శివలింగానికి శిఖరం ఉండదు.

Advertisement

ఇక్కడి శివలింగాన్ని భారీ కాయుడైన భీముడు( Bheema ) తన మోకాళ్ళపై కూర్చొని ఈ శివలింగాన్ని అర్జించేవాడని పురాణాలలో ఉంది.మహాశివరాత్రి కి ఇక్కడ పెద్ద వేడుక జరుగుతుంది.

భూపాల్ నుంచి మండిదీ వెళ్లే బస్సులో కొంత దూరం వెళ్లిన తర్వాత అక్కడి నుంచి ఈ దేవాలయానికి నేరుగా ఆటోలు వెళుతూ ఉంటాయి.

Advertisement

తాజా వార్తలు