నేను హీరోకి తల్లి గా కంటే ఒక మహిళగా ఉండటాన్ని ఎక్కువగా గర్వపడతాను

ప్రతి మహిళా ఈ కథనం పూర్తిగా చదివి తీరాల్సిందే.ఈ రోజు మనం చెప్పుకునే కథ ఒక మహిళా కథ.

 Do You Know About Siddhu Jonnalagadda Mother Sharada Jonnalagadda Details, Siddh-TeluguStop.com

కాదు .కాదు.ఆమె నలభయ్ ఏళ్ళ అనుభవం ఇచ్చిన తీయని బాధ.ఇక్కడ మీరు ఫోటో లో చూస్తున్న స్త్రీమూర్తి పేరు ‘శారద’. పూర్తి పేరు శారద జొన్నలగడ్డ. అల్ ఇండియా రేడియో లో వివిధ హోదాల్లో ఆమె చివరగా అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టర్ గా తన పదవి నుంచి విరమణ పొందారు.

అయితే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అల్ ఇండియా రేడియో వారు జరిపిన వేడుకలకు శారద జొన్నలగడ్డ ను ముఖ్య అతిధి గా పిలిచారు.

శారద గారిని చూస్తే నమస్కారం పెట్టకుండా ఉండలేని సంస్కారం తొణికిసలాడుతుంది.

ఆమె మాటలు, డిగ్నిటీ, అనేక విషయాలపైనా శారద గారికి ఉన్న నాలెడ్జ్ మనల్ని ఆశర్య చకితులను చేస్తుంది.కానీ ఈ నలభేయ్యల్ల పేరు, ప్రతిష్ట కేవలం రెండేళ్ల పాపులారిటీ ముందు చిన్నబోయింది.

ఎందుకంటే ఆ రెండేళ్ల పాపులారిటీ తన కొడుకుది.ఆమె అనుభవం ఈ సినిమా పాపులారిటీ ముందు ఎందుకు పనికి రాలేదు.

Telugu India Radio, Dj Tillu, Dj Tillu Mother-Movie

ఇంతకు ఆ కొడుకు ఎవరో తెలుసా.సిద్దు జొన్నలగడ్డ అలియాస్ డీజే టిల్లు.ఆమెను శారద గా కన్నా కూడా ఒక హీరో తల్లి గానే చూస్తున్నారు.అది ఆమె ఆవేదన.తన ప్రసంగం లో మొదటి నుంచి చివరి వరకు ఎక్కడ కూడా తన కొడుకు గురించి చెప్పాల్సిన అవసరం వచ్చిన కూడా మాట్లాడలేదు.నిండైన ఆత్మ విశ్వాసం తో తనను చిన్న తనం నుంచి ఎంతో స్వేచ్ఛను ఇచ్చిన ఆమె తండ్రి గురించి మాట్లాడారు.

Telugu India Radio, Dj Tillu, Dj Tillu Mother-Movie

తన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దిన తండ్రి తో పాటు తనకు ఎంతో సహాయ సహకారాలు అందించి ఇంతదాన్ని చేసిన తన భర్త గురించి ఆమె మాట్లాడారు.ఇక ఆమె ప్రసంగం ముగిసిన తర్వాత అక్కడ అర్జీ మహిళలు అంత కూడా డీజే టిల్లు పాటలకు స్టెప్పులు వేయడం తో ఆమె కళ్ళల్లో ఎంతో గర్వం కనిపించింది.డీజే టిల్లు ఫెమ్ మదర్ గా కాకుండా ఆమెను తన వృత్తి లో సాధించిన అనుభవాన్ని ప్రస్తావిస్తే ఆమె ఇంకా సంతోషపడి ఉండేవారు.కానీ ఒక తల్లిగా ఆమె ఎంతో తీయని బాధను పడ్డ అది చివరికి ఆనందమే కదా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube