భారత దేశ సినిమాలలో, అందులోనూ ముఖ్యంగా తెలుగు సినిమాలలో హాస్యానికి( Comedy ) ప్రాధాన్యం ఎక్కువ.ప్రేమ కథ చిత్రమైన, కుటుంబ కథ చిత్రమైన, యాక్షన్ ఎంటర్టైనర్ ఐనా, ఒక పిసరంత హాస్యం లేకపోతే సంతృప్తి చెందారు తెలుగు ప్రేక్షకులు.
మరి అలంటి హాస్యాన్ని పండించే హాస్య నటులు సినిమాకు చాలా ప్రధానం.తెలుగు పరిశ్రమలో ఎందరో హాస్య నటులు వస్తుంటారు, పోతుంటారు.
కొందరు నటులు ఎం స్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం లాగ ప్రేక్షకుల మనుసులలో ఎప్పటికి చెరగని ముద్ర వేస్తుంటారు.ఈ కాలంలో అటువంటి నటులు చాలా అరుదు.
ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీ లో అడుగుపెట్టి అతితక్కువ సమయంలో తనకంటూ ఒక స్థానం ఏర్పరుచుకున్న నటుడు రాజ్ కుమార్ కసిరెడ్డి.ఇతని గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
రాజ్ కుమార్ కసిరెడ్డి( Rajkumar Kasireddy ) 1992 జనవారు 12 న హైదరాబాద్ లో జన్మించాడు.నటన పై ఉన్న ఆసక్తితో సినీ పరిశ్రమలో అడుగుపెట్టాడు రాజ్ కుమార్.ఇతను నటించిన మొదటి చిత్రం రాజా వారు రాణి గారు. ఈ చిత్రం 2019 లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఎటువంటి పబ్లిసిటీ లేకుండా, కొత్త కాస్ట్ తో, ఒక కొత్త డైరెక్టర్ తో వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది.ఈ చిత్రం లో చౌదరి క్యారెక్టర్ లో హీరో స్నేహితుడిగా నటించాడు రాజ్ కుమార్.
ఈ చిత్రంలో తన గోదావరి యాసతో, కామెడీ టైమింగ్ తో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు ఈ కుర్ర నటుడు.దాంతో వరుస అవకాశాలు వచ్చి పడ్డాయి.
రాజా వారు రాణి గారు చిత్రం తరువాత రాజ్ కుమార్, అశోకవనంలో అర్జున కళ్యాణం( Ashokavanamlo Arjuna Kalyanam ), బ్లడ్ మేరీ, రంగ రంగ వైభవంగా, స్టాండ్ అప్ రాహుల్, సీత రామం, చిత్తం మహారాణి, రంగబలి, బెదురులంక చిత్రాలలో నడిచాడు.ప్రతి చిత్రంలోనూ తానాడైనా శైలిలో తన నటనతో మెప్పిస్తూనే ఉన్నాడు.మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన సాఫ్ట్ లవ్ స్టోరీ అశోకవనంలో అర్జున కళ్యాణం.ఈ సినిమాలో ఫోటోగ్రాఫర్ గా నటించాడు రాజ్ కుమార్.ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అనుకున్న విజయాన్ని సాధించకపోయినా, సినిమాలో నటనకు హీరో, హీరోయిన్లతో పాటు రాజ్ కుమార్ కు కూడా మంచి మార్కులు పడ్డాయి.తాజాగా సైమా 2023 అవార్డ్స్ లో అశోకవనంలో అర్జున కళ్యాణం చిత్రానికి గాను, ఉత్తమ హాస్య నటుడు విభాగంలో నామినేట్ అయ్యాడు రాజ్ కుమార్.
దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న లక్కీ భాస్కర్( Lucky Bhaskkar ) చిత్రంలో కూడా రాజ్ కుమార్ ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం.