మీ దగ్గర పాత TV వుందా? అయితే ఇలా స్మార్ట్​ TVగా మార్చేసుకోండి!

అదేంటి? పాత TVలను స్మార్ట్​ TVగా మార్చే వీలు వుంటుందా? అని ఆశ్చర్య పోవద్దు.ఈ కధనం పూర్తిగా చదివితే మీకే అర్ధం అవుతుంది.

 మీ దగ్గర పాత Tv వుందా? అయితే ఇలా �-TeluguStop.com

అది కూడా Airtel కస్టమర్లకు మాత్రమే ఈ సదవకాశం.అవును, సాధారణ TVలను కేవలం రూ.1500లకే స్మార్ట్ TVలుగా మార్చుకునే అవకాశాన్ని ఇపుడు Airtel అందిస్తోంది.Airtel ఎక్స్​ట్రీమ్​ బాక్స్​ ద్వారా పాత TVని స్మార్ట్ TVగా మార్చుకునే అవకాశాన్ని ఇపుడు తన వినియోగదారులకు కల్పిస్తోంది.

కుటుంబ సమేతంగా TV చూసే వారిని దృష్టిలో పెట్టుకొని ఈ ఆఫర్ ప్రకటించడం కొసమెరుపు.

ఇకపోతే నేడు OTTల హవా కొనసాగుతున్నవేళ, ఆ అవకాశం లేని వారికి స్మార్ట్ వినోదం పరిచయం చేసేందుకు ఈ ప్లాన్ చేసిందని నిపుణులు చెబుతున్నారు.

అంటే Airtel ఎక్స్​ట్రీమ్​ బాక్స్.​పాత TVలలోనే నేరుగా OTT కంటెంట్​ను ప్రసారం చేసే మాస్టర్ ప్లాన్ వేస్తోంది.ఇకపోతే ఎక్స్​ట్రీమ్ బాక్స్ అసలు ధర రూ.2,650 కాగా వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని కేవలం రూ.1500లకే అందిస్తోంది.ఈ ఎక్స్​ట్రీమ్​ సెటప్ బాక్స్ ద్వారా.

సోనీ లివ్, అమెజాన్ ప్రైమ్, ఈరోస్ నౌ, డిస్నీ+ హాట్‌స్టార్ వంటి అనేక ఓటీటీ ప్లాట్​ఫామ్​లోని కంటెంట్​ను చూడవచ్చు.

అంతేకాకుండా ఈ ఫీచర్లతో పాటు.ఈ సెటప్ బాక్స్ 4కే రిజల్యూషన్ కంటెంట్​ను కూడా అందిస్తుంది.కావలసినవారు ఈ బాక్స్​ను కంపెనీ వెబ్‌సైట్ నుంచి నేరుగా ఆర్డర్ చేసుకోండి.

లేదా దగ్గర్లోని ఎయిర్​టెల్ రిటైల్ స్టోర్​కు వెళ్లినా.ఈ సెటప్ బాక్స్ అందుబాటులో ఉంటుందని సదరు యాజమాన్యం చెబుతోంది.కాగా, ఇలాంటి ఫీచర్లతోనే మార్కెట్లో మరో సెటప్ బాక్స్ అందుబాటులో ఉంది.‘టాటా ప్లే బింజ్+’ పేరుతో టాటా స్కై కంపెనీ ఇలాంటి ఓటీటీ సెటప్ బాక్స్​ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.ఇకపోతే Airtel ఎక్స్​ట్రీమ్​ బాక్స్ 5000కు పైగా యాప్స్​కు సపోర్ట్ చేస్తుందని చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube