ఇలా చేసి మీ యూట్యూబ్ ఛానల్ సబ్‌స్క్రైబర్స్ ని పెంచుకోండి!

యూట్యూబ్ అంటే ఏమిటో తెలియని జనాలు దాదాపు ఉండరనే చెప్పుకోవాలి.ఈ స్మార్ట్ యుగంలో అందరి చేతుల్లోనూ స్మార్ట్ ఫోన్స్ వున్నాయి.

 Do This To Increase Your Youtube Channel Subscribers , Youtube Channel , Subscri-TeluguStop.com

దాంతో సోషల్ మీడియా మార్కెట్ బాగా విస్తరించింది.ఈ క్రమంలో కొంతమంది యూట్యూబ్ క్రియేటర్స్ పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తున్నారు.

టాలెంట్ ఎవడబ్బ సొత్తు కాదన్నట్టు, ఎవరి టాలెంట్ వారు యూట్యూబ్ మాధ్యమం ద్వారా చూపించి ప్రజాదరణ పొందుతున్నారు.ఈ క్రమంలో అనేకమంది డబ్బులు దండిగా సంపాదిస్తున్నారు.

మరికొంతమందైతే ఏకంగా సెలిబ్రిటీలు అయిపోతున్నారు.

అయితే కొందరికి సాధ్యపడింది, మరికొందరికి సాధ్యపడకపోవచ్చు.కొంతమంది యూట్యూబ్ క్రియేటర్లకు ఊరుకనే సబ్స్క్రైబర్స్ పెరుగుతూ వుంటారు.ఇంకొంతమంది ఎంత కష్టపడినా సబ్స్క్రైబర్స్ రాకపోవచ్చు.అయితే ఇల్నాటివారు వారి ఛానెల్ ఎలా ప్ర‌మోట్ చేసుకోవాలో ఇక్కడ చూద్దాం.ఈ ట్రిక్స్ ఫాలో అవ‌డం ద్వారా మీ Youtube ఛానెల్‌ను మీరే ప్ర‌మోట్ చేసుకోగలరు.

1.Youtube ఛానెల్ ప్ర‌మోట్ చేసుకునే ప్ర‌క్రియ‌లో భాగంగా ఇత‌ర యూట్యూబ‌ర్ల వీడియోల‌కు కామెంట్ చేయ‌డం అనేది మొదటి ప‌ద్ద‌తి.ఇత‌ర యూట్యూబ‌ర్ల వీడియోల‌కు మంచిగా, క్రియేటివ్‌గా కామెంట్ చేయ‌డం ద్వారా మ‌న ఛానెల్ పేరు అనేది ఆ యూట్యూబ‌ర్ స‌బ్‌స్క్రైబ‌ర్ల‌కు క‌నిపిస్తుంది.త‌ద్వారా కొంద‌రు వ్య‌క్తులు మీ కామెంట్ న‌చ్చి మీ ఛానెల్ లోకి ప్ర‌వేశించే అవ‌కాశం ఉంటుంది.

2.మీకు యూట్యూబ్ క‌మ్యూనిటీ ఫీచర్ పై అవ‌గాహన క‌లిగి ఉండాలి.

ఇది మీ ఛానెల్ ప్ర‌మోష‌న్ కు బాగా ప‌ని చేస్తుంది.ఫేస్‌బుక్ మరియు లింక్డ్‌ఇన్‌ల మాదిరిగానే కనిపించే స్టేటస్‌లతో సహా అనేక రకాల పోస్ట్‌లను సృష్టించడానికి మీరు ఫీచర్‌ని ఉపయోగించవచ్చు.

Telugu Subscribe, Subscribers, Latest, Youtube, Youtube Channel-Latest News - Te

3.మీరు చిన్న యూట్యూబ‌రా లేదా పెద్ద యూట్యూబ‌రా అనేది విష‌యం కాదు.మీ ఛానెల్‌లో గెస్ట్ అప్పియ‌రెన్స్ పాడ్ క్యాస్ట్‌ చేయ‌డం అనేది చాలా కీల‌కం.ఇలా గెస్ట్ అప్పియ‌రెన్స్ పెంచ‌డం ద్వారా మీ ఛానెల్‌కు చేరుకునే వారి సంఖ్య క్ర‌మంగా పెరుగుతుంది.

4.Twitter ప్లాట్‌ఫాం ఆన్‌లైన్ క్రియేట‌ర్ల‌కు మంచి వేదిక‌.

యూట్యూబ్‌లో మీరు క్రియేట్ చేసిన వీడియోల‌ను Twitter లో ట్వీట్ రూపంలో షేర్ చేయ‌డం ద్వారా మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుంది.ముఖ్య‌మైన, మీ వీడియో కంటెంట్‌కు సంబంధించిన‌ హ్యాష్ ట్యాగ్లు, కీ వ‌ర్డ్‌ల‌ను ఉప‌యోగించి ట్విట‌ర్‌లో మీ వీడియో లింక్ పోస్ట్ చేయ‌డం ద్వారా భారీగా వ్యూస్ ల‌భిస్తాయి.

5. FB, ట్విట్టర్ లాగే Reddit ఒకటి.

ఇది ప్రతి నెలా ఒక బిలియన్ సైట్ విజిట్స్ ను సంపాదిస్తోంది.ఈ ప్లాట్ ఫాంపై మీరు మీ లింక్‌ల‌ను పోస్ట్ చేయ‌డం ద్వారా మంచి స్పంద‌న‌ వస్తుంది.

పైన చెప్పినవాటిని పాటిస్తే మెల్లగా మీరు యూట్యూబ్ ప్రపంచంలో రారాజు కాగలరు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube