సినీ ఇండస్ట్రీలో కొన్ని సెంటిమెంట్లు వెంటాడుతుంటాయి.హిట్ ఇచ్చిన దర్శకులే మళ్ళీ హిట్ ఇస్తారని, లేదా మొదటి సినిమాతో హిట్ కొట్టిన దర్శకులు రెండో సినిమాతో ఫ్లాప్ ఇస్తారని ఇలా రకరకాల సెంటిమెంట్లు సినీ ఇండస్ట్రీలో చూస్తూ ఉంటాము.
అయితే ఈ రకమైన సెంటిమెంట్లు రాజకీయాల్లో కూడా అడపా దడపా కనిపిస్తూ ఉంటాయి.ముఖ్యంగా స్పీకర్ గా పని చేసిన వారిలో ద్వితీయ విఘ్నం సెంటిమెంట్ వెంటాడుతోంది.
అదేమిటంటే ఒకసారి స్పీకర్ గా పని చేసిన వారు రెండోసారి ఎన్నికల్లో ఓటమిపాలు కావడం.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1999 నుంచి ఈ రకమైన సెంటిమెంట్ కొనసాగుతూ వస్తోంది.
ప్రస్తుతం తెలంగాణ విషయానికొస్తే 2014 ఎన్నికల్లో టిఆర్‌ఎస్ ( బిఆర్‌ఎస్ ) విజయం సాధించిన తరువాత మధుసూదనచారి( Madhusudanachari ) స్పీకర్ గా పని చేశారు.
అయితే ఆయన 2018 ఎన్నికల్లో ఓటమిపాలు అయ్యారు.ఇక ప్రస్తుతం స్పీకర్ గా పని చేస్తున్న పోచారం శ్రీనివాస్ రెడ్డి( Pocharam Srinivas Reddy ) మరోసారి ఎన్నికల బరిలో నిలిచారు.మరి ఆయన ద్వితీయ విఘ్నన్ని అధిగమిస్తారా లేదా అనేది చూడాలి.
ఇక ఏపీ విషయానికొస్తే 2014 ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించిన తరువాత కోడెల శివప్రసాద్( Kodela Sivaprasad ) స్పీకర్ గా పని చేశారు.అయితే 2019 ఎన్నికల్లో ఆయన అంబటి రాంబాబు చేతిలో ఓటమిపాలు అయ్యారు.
ఇక ప్రస్తుతం ఏపీలో తమ్మినేని సీతారాం( Tammineni Sitaram ) స్పీకర్ గా కొనసాగుతున్నారు.గత ఎన్నికల్లో ఆముదాలవలస నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన ఆ తరువాత స్పీకర్ గా అధ్యక్ష బాద్యతలు చేపట్టారు.
వచ్చే ఎన్నికల్లో కూడా ఆముదాలవాసల నుంచి ఆయనే బరిలోకి దిగే అవకాశాలు ఉన్నట్లు టాక్.మరి ద్వితీయ విఘ్నన్ని తమ్మినేని సీతారాం అధిగమిస్తారో లేదో చూడాలి.ప్రస్తుతం తెలంగాణలో పోచారం శ్రీనివాస్ రెడ్డి పైన అలాగే ఏపీలో తమ్మినేని సీతారాం పైన వారి సొంత నియోజిక వర్గాల్లో వ్యతిరేకత గట్టిగానే కనిపిస్తోంది.పోచారం ఈసారి కూడా బాన్సువాడ నుంచే పోటీ చేస్తున్నారు.
ఈ నియోజిక వర్గంపై కాంగ్రెస్ గట్టిగా కన్నెసింది.మరి స్పీకర్ గా పని చేస్తున్న పోచారం ఇతర పార్టీల అభ్యర్థుల నుంచి పోటీ తట్టుకొని గెలిచి నిలుస్తారో లేదో చూడాలి.