సాధారణంగా కొంత మంది ప్రజలు తమ పెంపుడు జంతువులను తమతోపాటు తీసుకెళ్తుంటారు.ముఖ్యంగా ప్రైవేటు వాహనాలను బుక్ చేసుకున్నప్పుడు తమ పెంపుడు జంతువులను ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తీసుకెళ్తుంటారు.
అయితే ప్రస్తుతం నగరాల్లో ఎక్కువగా క్యాబ్ ల హావ నడుస్తోంది.ప్రయాణికులంతా క్యాబ్ లలోనే తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు.
అలాగే తమకు సంబంధించిన వస్తువులను, పెంపుడు జంతువులను క్యాబ్ లలోనే తరలిస్తున్నారు.కానీ ఒక మహిళ తన పెంపుడు జంతువును క్యాబ్ లో తరలించాలని అనుకున్నప్పుడు క్యాబ్ డ్రైవర్ అందుకు నిరాకరించాడు.
దీంతో ఆమె తనకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.
పూర్తి వివరాలు తెలుసుకుంటే.
కార్పొరేట్ ట్రైనర్ గా పనిచేస్తున్న రీమా చావ్లా ముంబైలోని చెంబూరు నుంచి కల్యాణ్ ప్రాంతానికి వెళ్లడానికి ఉబర్ క్యాబ్ ని బుక్ చేసుకున్నారు.అయితే క్యాబ్ డ్రైవర్ చేరుకున్నాక.
తనతో పాటు తన పెంపుడు కుక్క కూడా వస్తుందని ఆమె చెప్పారు.కానీ కుక్కలను క్యాబ్ లో ఎక్కించుకొనని డ్రైవర్ కరకండిగా నిరాకరించాడు.
ఈ సమాధానంతో షాకైన సదరు మహిళ తన రైడ్ క్యాన్సిల్ చేయమని కోరారు.తన పెంపుడు కుక్క ని ఎక్కించుకొక పోతే తాను కూడా క్యాబ్ ఎక్కనని.
అందుకే రైడ్ క్యాన్సిల్ చేయమని డ్రైవర్ని ఆమె అడిగారు కానీ డ్రైవర్ మాత్రం ఆమె తో వాగ్వాదానికి దిగాడు.
దీంతో చిర్రెత్తిన ఆమె వెంటనే సంస్థకు ఫిర్యాదు చేశారు.
బాధ్యత లేకుండా తనతో దురుసుగా ప్రవర్తించిన డ్రైవర్ పై చర్యలు తీసుకుని తనకు 50 వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని ఆమె ఊబర్ ఇండియా సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ను కోరారు.తన పెంపుడు కుక్కను గతంలో కూడా ఎక్కించుకోవడానికి క్యాబ్ డ్రైవర్లు నిరాకరించారని ఆమె వాపోయారు.
తాను చేస్తున్న న్యాయపోరాటానికి అయ్యే 15,000 ఖర్చులను కూడా ఉబర్ సంస్థ నే చెల్లించాలని ఆమె డిమాండ్ చేశారు.క్యాబ్ లలో పెంపుడు జంతువులను నిషేధించినట్టు ప్రభుత్వ నిబంధనలలో ఎక్కడా లేదని రీమా తరపు న్యాయవాది ప్రశాంత్ నాయక్ తన నోటీసులో పేర్కొన్నారు.
క్యాబ్ డ్రైవర్ తప్పు, క్యాబ్ సంస్థ లోపం వల్లనే రీమా చేదు అనుభవాన్ని ఎదుర్కోవాల్సి వచ్చిందని.వారం రోజుల్లో తమ నోటీసులపై ఉబర్ సంస్థ స్పందించకపోతే.కోర్టును ఆశ్రయిస్తామని ప్రశాంత్ నాయక్ హెచ్చరించారు.